News March 24, 2025

నిర్మల్ జిల్లాకు 1,27,748 జవాబు పత్రాలు : DEO

image

మూల్యాంకన విధులను పారదర్శకంగా నిర్వహించాలని డీఈవో రామారావు అన్నారు. నిర్మల్‌ జిల్లాకేంద్రంలో ఆదివారం సీసీఓలు, ఏసీవోలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. నిర్మల్‌ జిల్లా‌కేంద్రంలోని సెయింట్‌ థామస్‌ ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్షలకు సంబంధించిన స్పాట్‌ వాల్యూవేషన్‌ క్యాంప్ ఉంటుందన్నారు. మూల్యాంకన విధులు పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు. దాదాపు 1,27,748 జవాబు పత్రాలు జిల్లాకు చేరుతాయని తెలిపారు.

Similar News

News April 17, 2025

తడి, పొడి చెత్తలపై ప్రజల్లో అవగాహన పెంచాలి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో ఈనెల 19న మూడో శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను పటిష్ఠంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ఈ మాసంలో ఎలక్ట్రానిక్ వ్యర్ధాల రీసైక్లింగ్(ఈ వేస్ట్ రీసైక్లింగ్) అంశంతో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం సూచించిందని చెప్పారు. జిల్లా అంతట పరిశుభ్రత కార్యక్రమాలను పటిష్ఠంగా నిర్వహించాలని, తడి, పొడి చెత్తలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.

News April 17, 2025

కోడుమూరు: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

కోడుమూరు మండలం వర్కూరు గ్రామం సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద గురువారం రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెల్తుర్ధి మండలం శ్రీరంగపురానికి చెందిన వెంకటరాముడి మృతి చెందాడు. ఇరు బైక్‌ల మీద ఉన్న అరవింద్, వేణులు, బదినేహాల్ వాసులు షాషావలి, దాదపీరాలు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం కర్నూలు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 17, 2025

పాడేరు: హాట్ బజార్స్ నిర్మాణాలపై సమీక్ష

image

హాట్ బజార్స్ భవన నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఐటీడీఏ ఏపీవోలు వెంకటేశ్వరరావు, ప్రభాకరరావు ఆదేశించారు. ఐటీడీఏలో జీసీసీ, వెలుగు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో 44 హాట్ బజార్స్ మంజూరయ్యాయని చెప్పారు. ప్రతి మండలానికి ఒక మినీ సూపర్ బజార్ మంజూరు అయిందిని తెలిపారు.

error: Content is protected !!