News February 1, 2025
నిర్మల్: జిల్లాను రాష్ట్రస్థాయిలో ప్రథమంగా నిలపాలి: DEO

విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేలా ఉపాధ్యాయులు బోధన చేయాలని డీఈఓ రామారావు అన్నారు. నిర్మల్ పట్టణంలోని పంచశీల్ కళాశాలలో నిర్వహించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల కెరీర్ కౌన్సెలింగ్ గైడెన్స్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శిక్షణ తరగతులను ప్రారంభించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు.
Similar News
News November 3, 2025
SRSP UPDATE: 24 గంటల్లో 56,514 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 56,514 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు సోమవారం ఉదయం తెలిపారు. 16 స్పిల్ వే గేట్ల ద్వారా 47,060 క్యూసెక్కుల నీటిని వదిలామన్నారు. కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80.501 TMCలకు గాను తాజాగా పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.
News November 3, 2025
బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం

TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్కు తరలించి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు.
News November 3, 2025
గుండెలు పగిలే ఫొటో

TG: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో జరిగిన <<18183124>>ఆర్టీసీ బస్సు ప్రమాదంలో<<>> మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 17 మంది మరణించగా, అందులో 10 నెలల పాప కూడా ఉంది. తల్లి, బిడ్డ మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసి రోడ్డుపై ఉంచిన ఫొటో కన్నీరు తెప్పిస్తోంది. ప్రమాద సమయంలో టిప్పర్ మితిమీరిన వేగంతో వెళ్లినట్లు సమాచారం. ఘటనాస్థలం వద్ద ప్రయాణికుల ఆర్తనాదాలతో భీతావహ వాతావరణం నెలకొంది.


