News February 1, 2025

నిర్మల్‌: జిల్లాను రాష్ట్రస్థాయిలో ప్రథమంగా నిలపాలి: DEO

image

విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేలా ఉపాధ్యాయులు బోధన చేయాలని డీఈఓ రామారావు అన్నారు. నిర్మల్ పట్టణంలోని పంచశీల్ కళాశాలలో నిర్వహించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల కెరీర్ కౌన్సెలింగ్ గైడెన్స్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శిక్షణ తరగతులను ప్రారంభించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు.

Similar News

News February 14, 2025

మెదక్: నేటికి 11 ఏళ్లు..

image

సరిగ్గా ఇవాళ్టికి 11 ఏళ్లు. దేనికి అనుకుంటున్నారా..? రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌పై పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి. 2014, ఫిబ్రవరి 13న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కరీంనగర్ ఎంపీ హోదాలో ఆయన పోరాటం చేశారు. కాగా, ప్రస్తుతం ఆయన హుస్నాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

News February 14, 2025

12 ఏళ్లకే రాజుగా పట్టాభిషేకం.. 20వేల కోట్ల ఆస్తి!

image

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన మహారాజా పద్మనాభ్ సింగ్‌కు 12ఏళ్ల వయసులోనే రాజుగా పట్టాభిషేకం జరిగింది. ప్రస్తుతం 26ఏళ్ల వయసులో రూ.20వేల కోట్ల ఆస్తిని కలిగి ఉన్నారు. ఇంత డబ్బున్నా చదువుతో పాటు క్రీడలను వదల్లేదు. పోలో ఆటలో నైపుణ్యం సాధించి 2017లో IND జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. వారసత్వ కట్టడమైన సిటీ ప్యాలెస్‌ను పర్యాటకుల కోసం ఉంచారు. తల్లితో కలిసి మహిళలకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నారు.

News February 14, 2025

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు 90 మంది గైర్హాజర్

image

జనగామ జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు 90 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సెషన్‌లో 644 మంది విద్యార్థులకు గాను 577 మంది హాజరయ్యారని, రెండో సెషన్‌లో జరిగిన పరీక్షకు 492 మంది విద్యార్థులకు 469 మంది విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు.

error: Content is protected !!