News February 10, 2025
నిర్మల్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఇవే!

నిర్మల్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ నెల 15 లోపు ఎన్నికల సిబ్బందికి శిక్షణతో పాటు పోలింగ్ కేంద్రాల తుది జాబితాను విడుదల చేయనున్నారు. జిల్లాలో మొత్తం 157 ఎంపీటీసీ, 18 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. కాగా ఈ నెల 11న పోలీంగ్ కేంద్రాల ముసాయిదా విడుదల కానుంది.
Similar News
News February 23, 2026
పబ్బతి ఆలయ ప్రసాదంపై భక్తుల అసహనం

మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఊర్కొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులకు అందజేస్తున్న లడ్డూ ప్రసాదంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిమాణంతోపాటు నాణ్యత విషయంలో లడ్డూ బరువును తగ్గించడంపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెండర్ దారులు లాభాపేక్షతో ప్రసాదం బరువు తగ్గిస్తున్నారా? అనే అనుమానాలను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. పుణ్యక్షేత్రం ప్రతిష్ఠను కాపాడాలని వారు కోరుతున్నారు.
News February 23, 2026
APలో కలకలం.. మూత్రం ఆగి ఇద్దరు మృతి?

తూర్పు గోదావరి(D) <<19212464>>రాజమండ్రిలో<<>> అనూరియా(మూత్రం ఆగిపోవడం) కేసులు కలకలం రేపాయి. ఇప్పటివరకు ఇద్దరు చనిపోగా ఆస్పత్రుల్లో 13 మంది చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కల్తీ పాలు తాగడం వల్లే ఈ సమస్యలు తలెత్తాయనే ప్రచారం జరగడంతో పోలీసులు వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అధికారులు పాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు.
News February 23, 2026
అనూరియా అంటే ఏమిటి?

మూత్రపిండాలు సరైన మోతాదులో మూత్రాన్ని ఉత్పత్తి చేయకపోవడాన్ని అనూరియా అంటారు. కిడ్నీ ఫెయిల్యూర్, డీహైడ్రేషన్, కిడ్నీల్లో రాళ్ల వల్ల ఈ సమస్య వస్తుంది. మూత్రం రాకపోవడం, కాళ్ల వాపు, అలసట, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది దీని లక్షణాలు. ఇదొక అత్యవసర పరిస్థితి. వెంటనే వైద్యుడిని కలిసి చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకం కావొచ్చు. కల్తీ పాలు తాగడం వల్ల రాజమండ్రిలో పలువురి మూత్రపిండాలు ఫెయిలైనట్లు సమాచారం.


