News May 25, 2024
నిర్మల్ జిల్లాలో గతేడాది 98 మందిపై కేసు: ఎస్పీ

నిర్మల్ జిల్లాలో పేకాట జోరుగా సాగుతోంది. జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక చోట పేకాటాడుతూ పట్టబడుతున్నారని ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. కాగా 2023లో 605 మంది జూదరులు పట్టుబడగా 98 మందిపై కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. వారి వద్ద రూ.15,48,515 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో పేకాటను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News October 19, 2025
ADB: చివరి రెండు రోజులు పోటెత్తారు!

మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంచడంతో జిల్లాలో ఈసారి 711 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంలో 1047 వచ్చినా, ఫీజు పెంపుతో ప్రభుత్వానికి రూ.21.33 కోట్ల ఆదాయం సమకూరింది. గతంతో పోలిస్తే రూ.39లక్షలు ఎక్కువ. ఉట్నూర్ ఎసైజ్ స్టేషన్ పరిధిలో 39వ షాపునకు అత్యధికంగా 25 దరఖాస్తులు వచ్చాయి. 9 షాపులకు రీ-టెండర్ అవకాశం ఉండగా, 3రోజుల క్రితం100లోపే దరఖాస్తులుండగా.. చివరి 2 రోజుల్లో భారీగా వచ్చాయి.
News October 19, 2025
‘పది’లో ఆదిలాబాద్ ప్రత్యేకంగా నిలిచేలా

గతేడాది పదో తరగతిలో జిల్లా 97.95% ఉత్తీర్ణత సాధించి, రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. ఈసారి కూడా అదే తరహాలో మరింత పకడ్బందీగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. జిల్లాలోని 130 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 6,354 మంది విద్యార్థులకు ఇప్పటికే అభ్యసన దీపికలు, పోషకాలతో కూడిన బ్రెడ్ అందిస్తున్నారు. రోజూ సాయంత్రం 4:15 నుంచి 5:15 వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి.
News October 18, 2025
పత్తి కొనుగోళ్లు, కౌలు రైతు నమోదుపై ADB కలెక్టర్ సమీక్ష

జిల్లాలో పత్తి కొనుగోళ్లు, కౌలు రైతుల నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పత్తి కొనుగోళ్లు, కౌలు రైతుల నమోదు, క్రాప్ బుకింగ్, పంట నష్టం అంచనాలపై వ్యవసాయ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.