News February 16, 2025
నిర్మల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

1)జిల్లా అంతటా సేవాలాల్ జయంతి వేడుకలు2)ఖానాపూర్: బాలుడిపై దాడి చేసిన కోతులు3)భైంసా: ముగ్గురు బైక్ దొంగల అరెస్ట్4)నిర్మల్ జిల్లాలో నేడు విద్యాసంస్థలకు సెలవు5)సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మల్ ఎమ్మెల్యే
Similar News
News November 21, 2025
రానున్న ఐదు రోజులు భద్రాద్రి జిల్లాకు అతి తేలిక పాటి వర్షాలు

రానున్న ఐదు రోజులు భద్రాద్రి జిల్లాలో అతి తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణ హెచ్చరికలు ఏమీ లేవని చెప్పారు. గత కొద్ది రోజులుగా పొడి వాతావరణ ఉండడంతో రైతులు పత్తి పంటను సేకరించుకున్నారు. తిరిగి తేలికపాటి వర్షాలు ప్రారంభం కావడంతో పత్తి, వరి రైతులు నష్టపోయే అవకాశం ఉంది.
News November 21, 2025
వరంగల్: ఫిట్నెస్ లేని స్కూల్ వాహనాలను సీజ్ చేయాలని వినతి

ప్రైవేట్ పాఠశాలలో నడుపుతున్న ఫిట్నెస్ లేని స్కూల్ వ్యాన్లను, టాటా మ్యాజిక్ వాహనాలను సీజ్ చేయాలని కోరుతూ ఈరోజు వరంగల్ ఇన్ఛార్జ్ ఆర్టీవో శోభన్ బాబుకు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ల్యాదల్ల శరత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్, పీడీఎస్యూ నాయకులు అర్జున్, సూర్య పాల్గొన్నారు.
News November 21, 2025
69వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

69వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు శుక్రవారం జొహరాపురం పరిధిలోని మున్సిపల్ హై స్కూల్ పాఠశాలలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీల ప్రారంభ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు విజయానికి పొంగిపోకుండా పరాజయానికి ఒత్తిడి కాకుండా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. డీఈవో కబడ్డీ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు.


