News February 26, 2025

నిర్మల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

1)నిర్మల్‌ పోలింగ్ కేంద్రాలకు తరలిన ఎన్నికల సామగ్రి 
2)నిర్మల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ ఉద్యోగాలు
3)నర్సాపూర్ (జి)లో 218 లీటర్ల అక్రమ మద్యం పట్టివేత
4)కుబీర్: గుండెపోటుతో లైన్ ఇన్స్పెక్టర్ మృతి 
5)దస్తూరాబాద్‌: పురుగుమందు తాగి ఒకరి సూసైడ్
6)నిర్మల్ : జిల్లా అంతటా శివరాత్రి వేడుకలు

Similar News

News December 9, 2025

పెద్దపల్లి: ముగింపు దశకు మొదటి విడత ప్రచార పర్వం

image

పెద్దపల్లి జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంథని, కమాన్పూర్, రామగిరి, శ్రీరాంపూర్, ముత్తారం మండలాల్లో 99 సర్పంచ్, 896 వార్డు మెంబర్ల ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తోంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఓట్ల కోసం నాయకులు ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. పలుచోట్ల అభ్యర్థులు సోషల్ మీడియా బృందాలను ఏర్పాటు చేసుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

News December 9, 2025

నేడు కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

image

డిసెంబర్ ఒకటి నుంచి ప్రారంభమైన ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్‌లోని ఐడీఓసీ ప్రాంగణంలో ఉదయం 10:00 గంటలకు కలెక్టర్ ఆదర్శ్ సురభి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనున్నట్లు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి సీతారాం తెలిపారు.

News December 9, 2025

NGKL: జిల్లాలో విపరీతంగా పెరిగిన చలి తీవ్రత

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో గత ఐదు రోజుల నుంచి చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. గడిచిన 24 గంటలో అత్యల్పంగా కల్వకుర్తి మండలం తోటపల్లిలో 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బిజినేపల్లిలో 10.6, తెలకపల్లి 11.0, తాడూర్ మండలం యంగంపల్లిలో 11.1, అమ్రాబాద్‌లో 11.2, ఊర్కొండ 11.5, వెల్దండ 11.6, బల్మూరు మండలం కొండారెడ్డిపల్లిలో 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.