News March 2, 2025
నిర్మల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

1.నిర్మల్: బైక్ను ఢీకొన్న లారీ.. వ్యక్తికి గాయాలు
2.జాతీయ స్థాయికి ఎంపికైన పెంబి విద్యార్థి
3.కడెం: అదుపుతప్పి చెట్టును ఢీకొన్న లారీ
4.బాసర: బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన అధికారులు
Similar News
News December 7, 2025
‘నిజామాబాద్ జిల్లాలో మితిమీరుతున్న వీడీసీల ఆగడాలు’

నిజామాబాద్ జిల్లాలో వీడీసీల ఆగడాలు మితిమీరుతున్నాయని పలువురు మండిపడుతున్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీలు వేలం పాట వేసి బలవంతంగా ఏకగ్రీవాలు చేస్తున్నారని పలువురు ఆరోపరిస్తున్నారు. మోర్తాడ్ మండలం <<18479746>>డోన్కల్లో రూ.32 లక్షలకు వేలం<<>> వేసినట్లు ఎస్సీ అభ్యర్థి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. బాల్కొండ,ఆర్మూర్ నియోజకవర్గాల్లో చాలా గ్రామాల్లో ఇలా జరుగుతున్నా వాటిని బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
News December 7, 2025
విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన లెక్చరర్

శ్రీకాళహస్తిలోని రిపబ్లిక్ క్లబ్ వద్ద గల ఓ ప్రైవేట్ కళాశాల తెలుగు లెక్చరర్ విద్యార్థినిని వాతలు పడేటట్లు కొట్టాడు. స్థానిక గోపాలవనం వద్ద నివాసం ఉంటున్న అనీస్ అనే విద్యార్థి శనివారం కళాశాలకు వెళ్లాడు. అక్కడ తెలుగు లెక్చరర్ విద్యార్థి పేరాగ్రాఫర్ రాయలేదని బెత్తంతో వాతలు పడేటట్లు కొట్టాడు. కళాశాల యజమాన్యంపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వ్యవహరించడం సరికాదన్నారు.
News December 7, 2025
ప్రతీ టీచర్ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది: డీఈవో

పదో తరగతి ఫలితాల కోసం ప్రతీ టీచర్ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందని డీఈవో శామ్యూల్ పాల్ అన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఉన్నత పాఠశాలలో స్టడీ అవర్స్ తరగతులను శనివారం ఆయన పరిశీలించారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా పాఠ్యాంశాలపై అవగాహన కల్పించి, పాఠాలు పూర్తిగా నేర్పే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆయన తెలిపారు. ప్రతీ పాఠశాలలో షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.


