News February 25, 2025
నిర్మల్ జిల్లాలో నేటి TOP NEWS

*నిర్మల్‌లో చిన్నారిపై కుక్కల దాడి*గంజాల్ టోల్ ప్లాజా వద్ద రూ.18 లక్షల నగదు పట్టివేత*కడెంలో పురుగు మందు తాగి వివాహిత సూసైడ్ *పలు మండలాల్లో ఎమ్మెల్సీ ఓటర్ స్లిప్స్ పంపిణీ*జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం*ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీ నేతలతో కలెక్టర్, ఎస్పీ సమీక్ష.
Similar News
News February 25, 2025
కీసరగుట్టపై నేటి కార్యక్రమాలు

కీసరగుట్ట శ్రీ భవాని శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభం అయ్యాయి. 2వ రోజు మంగళవారం కార్యక్రమాలు: ఉదయం 9:00 గంటలకు రుద్రస్వాహాకార హోమం, సాయంత్రం 4:00 గంటలకు జ్వాలార్చన, రాత్రి 7:00 గంటలకు ప్రదోషకాల పూజ, రాత్రి 8:00 గంటలకు శ్రీ రామలింగేశ్వర స్వామి కీసర నుంచి కీసర గుట్టకు బయలుదేరుతారు. రాత్రి10:00 గంటలకు స్వామి వారి కళ్యాణం వైభవంగా జరగనుంది.
News February 25, 2025
జేఈఈ మెయిన్ సెషన్2 దరఖాస్తులకు నేడే ఆఖరు

జేఈఈ మెయిన్ సెషన్2 దరఖాస్తులకు గడువు నేటితో ముగియనుంది. అభ్యర్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 1-8 మధ్య మెయిన్ పరీక్ష జరగనుంది. తొలి సెషన్ పరీక్ష జనవరిలో జరిగిన సంగతి తెలిసిందే.
వెబ్‌సైట్: https://jeemain.nta.nic.in/
News February 25, 2025
పిఠాపురం: వైరల్ అవుతున్న పవన్ AI ఫొటో

జిల్లాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ AI ఫొటో వైరల్‌గా మారింది. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి పట్టభద్రుల MLC కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌కి నిన్న మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన ఓ వీడియో ద్వారా తెలిపారు. అయితే ఆయన ఓటును అభ్యర్థిస్తూ AIతో చేసిన ఫొటోను కూటమి నేతలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.