News February 5, 2025
నిర్మల్ జిల్లాలో బయటపడ్డ గణపతి, కాలభైరవ విగ్రహాలు

నిర్మల్ జిల్లా ముధోల్ జడ్పీ ఉన్నత పాఠశాల దగ్గరలోని పొలంలో గణపతి, కాలభైరవ విగ్రహాలు బయటపడ్డాయి. మట్టిలో కూరుకుపోయిన ఒక రాతి గుండు మీద రాష్ట్రకూట శైలిలో ఉన్న ద్విభుజ గణపతి విగ్రహం, దానికి ఒక పక్కన కాలభైరవుడు, మరో పక్క సర్పం విగ్రహాలు బయటపడ్డాయి. స్పష్టంగా చెక్కబడిన ఈ విగ్రహాలు రేఖామాత్రంగా కనిపిస్తున్నాయి. 9వ శతాబ్దానికి చెందిన భావిస్తున్న భావిస్తున్న ఈ విగ్రహంలో గణపతి సుఖాసన స్థితిలో ఉంది.
Similar News
News November 14, 2025
పదో తరగతిలో 100% ఉత్తీర్ణతే లక్ష్యం: నంద్యాల కలెక్టర్

నంద్యాల జిల్లాలో పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులతో ఆమె సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల అధ్యయన పద్ధతులు, బోధనా ప్రమాణాల మెరుగుదలపై కలెక్టర్ మార్గదర్శకాలు ఇచ్చారు.
News November 14, 2025
హత్య కేసులో జైలుకు.. MLAగా విజయం

హత్య కేసులో అరెస్టై జైలులో ఉన్న NDA అభ్యర్థి, జేడీ(యూ) నేత అనంత్ కుమార్ సింగ్ MLAగా విజయం సాధించారు. బిహార్ మోకామా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవిపై 28,206 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. జన్ సురాజ్ పార్టీ పోల్ వర్కర్ దులార్ చంద్ యాదవ్ మర్డర్ కేసులో నవంబర్ 2న అరెస్టయ్యారు. అనంత్ కుమార్ సింగ్కు 91,416, వీణా దేవికి 63,210 ఓట్లు దక్కాయి.
News November 14, 2025
నవజాత శిశు వారోత్సవాలు నిర్వహించాలి: DM&HO

మాతా శిశు సేవల ద్వారా గర్భిణులను గుర్తించి సకాలంలో రికార్డుల్లో నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డీ.కృష్ణమూర్తి నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాడేరు డీఎంహెచ్వో కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. మాతా శిశువులకు నిర్ధేశించిన సమయానికి వ్యాధి నిరోధక టీకాలు అందించాలని సూచించారు. ఈనెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జాతీయ నవజాత శిశు వారోత్సవాలు నిర్వహించాలన్నారు.


