News February 5, 2025
నిర్మల్ జిల్లాలో బయటపడ్డ గణపతి, కాలభైరవ విగ్రహాలు

నిర్మల్ జిల్లా ముధోల్ జడ్పీ ఉన్నత పాఠశాల దగ్గరలోని పొలంలో గణపతి, కాలభైరవ విగ్రహాలు బయటపడ్డాయి. మట్టిలో కూరుకుపోయిన ఒక రాతి గుండు మీద రాష్ట్రకూట శైలిలో ఉన్న ద్విభుజ గణపతి విగ్రహం, దానికి ఒక పక్కన కాలభైరవుడు, మరో పక్క సర్పం విగ్రహాలు బయటపడ్డాయి. స్పష్టంగా చెక్కబడిన ఈ విగ్రహాలు రేఖామాత్రంగా కనిపిస్తున్నాయి. 9వ శతాబ్దానికి చెందిన భావిస్తున్న భావిస్తున్న ఈ విగ్రహంలో గణపతి సుఖాసన స్థితిలో ఉంది.
Similar News
News February 20, 2025
ఫిబ్రవరి 20: చరిత్రలో ఈరోజు

1935: ఏపీ మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి జననం
1946: దివంగత నటి, దర్శకురాలు విజయ నిర్మల జననం
1973: సంగీత దర్శకుడు టి.వి.రాజు మరణం
2010: నటుడు బి.పద్మనాభం మరణం
* ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
News February 20, 2025
ఈరోజు నమాజ్ వేళలు

తేది: ఫిబ్రవరి 20, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 5.27 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.40 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
అసర్: సాయంత్రం 4.43 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.20 గంటలకు
ఇష: రాత్రి 7.33 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 20, 2025
పెద్దగట్టుకు ఘాట్ రోడ్డు, గెస్ట్ హౌస్: కోమటిరెడ్డి

రూ.60 కోట్లతో పెద్దగట్టుకు ఘాట్ రోడ్డు, గెస్ట్ హౌస్ నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. జాతరలో పాల్గొని స్వామి వారి దర్శనం అనంతరం మాట్లాడారు. సాధారణ సమయంలోనూ వేలాదిగా భక్తులు తరలివచ్చే మహిమాన్విత జాతర పెద్దగట్టు అన్నారు. వచ్చే జాతరలోపు భక్తులు ఇబ్బందులు పడకుండా బాత్‌రూమ్‌లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు.