News February 5, 2025
నిర్మల్ జిల్లాలో బయటపడ్డ గణపతి, కాలభైరవ విగ్రహాలు

నిర్మల్ జిల్లా ముధోల్ జడ్పీ ఉన్నత పాఠశాల దగ్గరలోని పొలంలో గణపతి, కాలభైరవ విగ్రహాలు బయటపడ్డాయి. మట్టిలో కూరుకుపోయిన ఒక రాతి గుండు మీద రాష్ట్రకూట శైలిలో ఉన్న ద్విభుజ గణపతి విగ్రహం, దానికి ఒక పక్కన కాలభైరవుడు, మరో పక్క సర్పం విగ్రహాలు బయటపడ్డాయి. స్పష్టంగా చెక్కబడిన ఈ విగ్రహాలు రేఖామాత్రంగా కనిపిస్తున్నాయి. 9వ శతాబ్దానికి చెందిన భావిస్తున్న ఈ విగ్రహంలో గణపతి సుఖాసన స్థితిలో ఉంది.
Similar News
News December 10, 2025
సౌతాఫ్రికా చెత్త రికార్డ్

నిన్న భారత్తో జరిగిన తొలి T20లో ఓటమితో SA జట్టు చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. ఆరుసార్లు 100 పరుగుల లోపు ఆలౌట్ అయిన జట్టుగా నిలిచింది. ఇందులో మూడుసార్లు భారత్ ప్రత్యర్థి కావడం గమనార్హం. 2022లో 87 రన్స్, 2023లో 95 పరుగులకే SA ఆలౌటైంది. నిన్నటి మ్యాచ్లో 74 రన్స్కే ప్రొటీస్ బ్యాటర్లు చాప చుట్టేశారు. అలాగే IND చేతిలో అతి ఎక్కువసార్లు తక్కువ పరుగులకే ఆలౌట్ అయిన జట్ల జాబితాలో SA 4వస్థానంలో ఉంది.
News December 10, 2025
తిరుపతి: ఐదుగురి స్టేట్మెంట్ రికార్డు

తిరుపతి NSUలో లైంగిక వేధింపుల కేసు విచారణలో భాగంగా పోలీసులు ఐదుగురి స్టేట్మెంట్లు రికార్డు చేసినట్లు తెలుస్తోంది. వర్సిటీకి సంబంధించి నలుగురు కాగా.. ఒడిశాలో యువతి స్టేట్మెంట్ ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. ఒడిశా వెళ్లిన సీఐ బుధవారం తెల్లవారుజామున తిరుపతికి రానున్నారు. ఆ తర్వాత పక్కా ఆధారాలతో నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.
News December 10, 2025
నేడు రోడ్డెక్కనున్న 65 ఎలక్ట్రిక్ బస్సులు

TG: హైదరాబాద్లో కాలుష్యానికి పరిష్కారంగా ఇవాళ 65 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. రాణిగంజ్ RTC డిపోలో బస్సుల ప్రారంభ కార్యక్రమం జరగనుండగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నారు. ఈ బస్సులను ఈవీ ట్రాన్స్ అనే సంస్థ ఆపరేట్ చేస్తుండగా, ఆ సంస్థే నిర్వహణ బాధ్యతలను చూసుకోనుంది. 2047 నాటికి గ్రీన్ ఎనర్జీ ఆధారిత రవాణా విధానంతో ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.


