News February 5, 2025

నిర్మల్ జిల్లాలో బయటపడ్డ గణపతి, కాలభైరవ విగ్రహాలు

image

నిర్మల్ జిల్లా ముధోల్ జడ్పీ ఉన్నత పాఠశాల దగ్గరలోని పొలంలో గణపతి, కాలభైరవ విగ్రహాలు బయటపడ్డాయి. మట్టిలో కూరుకుపోయిన ఒక రాతి గుండు మీద రాష్ట్రకూట శైలిలో ఉన్న ద్విభుజ గణపతి విగ్రహం, దానికి ఒక పక్కన కాలభైరవుడు, మరో పక్క సర్పం విగ్రహాలు బయటపడ్డాయి. స్పష్టంగా చెక్కబడిన ఈ విగ్రహాలు రేఖామాత్రంగా కనిపిస్తున్నాయి. 9వ శతాబ్దానికి చెందిన భావిస్తున్న ఈ విగ్రహంలో గణపతి సుఖాసన స్థితిలో ఉంది.

Similar News

News October 25, 2025

కౌకుంట్లలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గత 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కౌకుంట్లలో 82.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సల్కర్‌పేటలో 53.5, దేవరకద్రలో 42.0, మహమ్మదాబాద్‌లో 35.8, అడ్డాకులలో 34.5, హన్వాడలో 22.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పలుచోట్ల కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది.

News October 25, 2025

అప్పుల్లో అగ్రస్థానంలో ఏపీ ప్రజలు!

image

దేశంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్పులు ఎక్కువగా చేస్తున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ తాజా నివేదిక వెల్లడించింది. AP తొలి స్థానంలో, తెలంగాణ రెండో ప్లేస్‌లో ఉన్నట్లు చెప్పింది. 2020-21 లెక్కల ప్రకారం ఏపీలో 43.7%, తెలంగాణలో 37.2% మంది అప్పుల్లో చిక్కుకున్నారు. కేరళ(29.9), తమిళనాడు(29.4), కర్ణాటక (23) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీలో అత్యల్పంగా 3.2%, ఛత్తీస్‌గఢ్‌లో 6.5% మంది ఉండటం గమనార్హం.

News October 25, 2025

కీళ్ల నొప్పులు మహిళలకే ఎందుకు ఎక్కువ?

image

పురుషులతో పోలిస్తే మహిళల్లోనే కీళ్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి జన్యుపరంగానే కాకుండా జీవనశైలి కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘రుతుస్రావం, గర్భం, మెనోపాజ్ సమయాల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలలో మార్పులు ఆర్థరైటిస్ లక్షణాలను ప్రభావితం చేస్తాయి. అలాగే బరువు పెరగడం, ఇంటి పనులు, శారీరక, మానసిక సమస్యలు కూడా కీళ్లపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి’ అని పేర్కొంటున్నారు.