News April 1, 2025
నిర్మల్ జిల్లాలో భానుడి భగభగ

నిర్మల్ జిల్లాలో ఎండలు ఠారేత్తిస్తున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో రోజూ 38 డిగ్రీల నుంచి 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉదయం 10 దాటితే రోడ్లన్ని నిర్మాణుష్యాన్ని తలపిస్తున్నాయి. బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News December 4, 2025
NLG: రెండు రంగుల్లో బ్యాలెట్ పత్రాలు

సర్పంచ్, వార్డు సభ్యుడికి బ్యాలెట్ పత్రాలు వేర్వేరుగా ఉంటాయి. సర్పంచ్ అభ్యర్థికి గులాబీ రంగు, వార్డు సభ్యుడికి తెలుపు రంగు ఉన్న బ్యాలెట్ పేపర్‌ను ఎన్నికల అధికారులు సిద్ధం చేస్తున్నారు. నల్గొండ, చండూరు డివిజన్ పరిధిలో 14 మండలాల్లో 318 గ్రామపంచాయతీలో 991 సర్పంచ్ అభ్యర్థులు, 2,870 వార్డుల్లో 7,893 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి విడత పోలింగ్‌కు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
News December 4, 2025
తొక్కిసలాటకు ఏడాది.. దయనీయస్థితిలో శ్రీతేజ్

గతేడాది Dec 4 రాత్రి ‘పుష్ప-2’ ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన <<14796361>>తొక్కిసలాటలో<<>> గాయపడిన శ్రీతేజ్ పరిస్థితి ఏడాదైనా దయనీయంగానే ఉంది. తానంతట తాను అన్నం తినలేని స్థితిలో ఉలుకూపలుకూ లేకుండా పడి ఉంటున్నాడు. ఎవరినీ గుర్తుపట్టలేక పోతున్నాడు. అతడికి చికిత్స ఇప్పించేందుకు నెలకు రూ.1.50 లక్షలు ఖర్చవుతున్నాయని, అల్లు అర్జున్ మేనేజర్‌ను సంప్రదిస్తే సానుకూల స్పందన లేదని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపారు.
News December 4, 2025
WGL: తొలి విడత బరిలో 10,901 అభ్యర్థులు

ఉమ్మడి జిల్లాలో తొలివిడత 555 సర్పంచ్ స్థానాలకు 1,817, 4,952 వార్డు స్థానాలకు 9,084 నామినేషన్లు దాఖలయ్యాయి. WGLలో 91 GPలకు 305, 800 వార్డులకు 1427 నామినేషన్లు వచ్చాయి. HNKలో 69 GPలకు 264, 658 వార్డులకు 1339, JNలో 110 GPలకు సర్పంచ్ 340, 1024 వార్డులకు 1893, MHBDలో 155 GPలకు 468, 1338వార్డులకు 2391, ములుగులో 48 GPలకు178, 420 వార్డులకు 557, BHPLలో 82 GPలకు 262, 712 వార్డులకు 1,477 నామినేషన్లు పడ్డాయి.


