News April 11, 2025

నిర్మల్ జిల్లాలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం భైంసా మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. భైంసా పట్టణం గోపాల్‌నగర్‌కు చెందిన బోయిడోళ్ల రాజు (32) వానల్పాడ్ నుంచి నడుచుకుంటూ తిమ్మాపూర్ వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News April 11, 2026

ఏఐ సాంకేతికతతో ఆదాయ వృద్ధి: భట్టి విక్రమార్క

image

మైనింగ్, రవాణా శాఖల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ ఆదాయాన్ని పెంచేందుకు ‘ఏఐ’ సాంకేతికతను వినియోగించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్నారు. గత 3 నెలల్లో జీఎస్టీ ఆదాయం 15 శాతం పెరగడంపై హర్షం వ్యక్తం చేశారు.

News April 11, 2026

మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు రూ.1.28కోట్లు

image

మార్కాపురం మండలం రాయవరం సమీపంలో ఇటీవల ఘోర బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.1.28 కోట్లు విడుదల చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 14 మందికి రూ.5 లక్షలు, గాయపడిన 29 మందికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు.. మొత్తం రూ.1.28 కోట్లు ఇవ్వనున్నారు.

News April 11, 2026

వచ్చే వారం CBSE టెన్త్ ఫలితాలు?

image

వచ్చే వారం CBSE టెన్త్ క్లాస్ (సెషన్-1) ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 8వేలకు పైగా సెంటర్లలో జరిగిన ఈ పరీక్షలకు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా ఈ ఏడాది నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించాలని CBSE నిర్ణయించింది. మొదటి సెషన్ కంపల్సరీ కాగా పర్ఫార్మెన్స్ పెంచుకునేందుకు రెండో సెషన్ రాయొచ్చు. మే 15 నుంచి జూన్ 1 వరకు రెండో సెషన్ పరీక్షలు జరగనున్నాయి.