News March 20, 2025

నిర్మల్ జిల్లాలో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

image

నిర్మల్ జిల్లాలో మూడ్రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం కలగనుంది. పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతన్న ఆందోళన చెందుతున్నారు. రైతులు పంటలను సంరక్షిచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News October 20, 2025

చుంచుపల్లి: బాంబు పేలి బాలుడి చేతికి తీవ్ర గాయం

image

దీపావళి పండుగనాడు టపాకాయలు కాలుస్తుండగా బాలుడి చేతికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం రాత్రి చుంచుపల్లి మండలంలో జరిగింది. చుంచుపల్లి తండా గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలుడు బానోతు విక్కీ టపాకాయలు కాలుస్తుండగా చేతిలో బాంబు పేలింది. గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

News October 20, 2025

కాసేపట్లో భారీ వర్షం..

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కాసేపట్లో యాదాద్రి భువనగిరి, జనగామ, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి ఉదయంలోపు వానలు పడతాయని పేర్కొన్నారు. అటు ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.

News October 20, 2025

ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఇంట ప్రగతి వెలుగులు: సీతక్క

image

రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంట సంక్షేమం, అభివృద్ధి వెలుగులు నిండాయని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గ్రూప్-1, గ్రూప్-2తో పాటు పలు ఉద్యోగ నియామకాలతో నిరుద్యోగుల ఇంట నిజమైన పండుగ జరుగుతోందని తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి సీతక్క దీపావళి వేడుకలు జరుపుకున్నారు.