News March 21, 2025

నిర్మల్ జిల్లాలో సినిమా షూటింగ్

image

సప్తగిరి -ప్రియాంక శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన పెళ్లి కానీ ప్రసాద్ చిత్రం నేడు విడుదల కానుంది. కాగా, అసోసియేట్ డైరెక్టర్ సుదీర్ రెడ్డి స్వగ్రామం మామడ మండలం కమల్ కోట్ కావడంతో పలు సన్నివేశాలు కమల్ కోట్‌తో పాటు లక్ష్మణ్ చందా మండలం వడ్యాల్‌లో చిత్రీకరించారు. దీంతో నేడు సినిమా రిలీజ్ కానుండటంతో సినిమా చూసేందుకు నిర్మల్ నియోజకవర్గ వాసులు ఆసక్తి చూపుతున్నారు.

Similar News

News October 22, 2025

గాజాలో చిన్నారికి ‘సింగపూర్’ పేరు.. కారణమిదే

image

కష్ట కాలంలో అన్నం పెట్టిన స్వచ్ఛంద సంస్థ పట్ల పాలస్తీనాకు చెందిన తల్లిదండ్రులు కృతజ్ఞతను చాటుకున్నారు. సింగపూర్‌కు చెందిన ‘లవ్ ఎయిడ్ సింగపూర్’ సంస్థ గాజాలో ఉచితంగా ఆహారం అందజేసింది. ఇందులో వంటమనిషిగా పనిచేసిన స్థానికుడైన హదాద్ ఇటీవల ఓ పాపకు తండ్రి అయ్యాడు. ఈ క్రమంలో తమకు అండగా నిలిచినందుకు బిడ్డకు ‘సింగపూర్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా వైరలవుతోంది.

News October 22, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 22, 2025

జూబ్లీహిల్స్: నేటి నుంచి నామినేషన్ల పరిశీలన..!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. మంగళవారంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక నేటి నుంచి వాటి పరిశీలన కార్యక్రమం కొనసాగనుంది. వందలాది నామినేషన్లు రావడంతో పూర్తి పరిశీలనకు కాస్త సమయం పట్టే అవకాశముంది. ఇదిలా ఉండగా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈనెల 24 వరకు అవకాశం ఉంది.