News April 10, 2025

నిర్మల్ జిల్లాలో 0.2 మి.మీ వర్షపాతం

image

నిర్మల్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో 0.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తానూర్‌లో 1.2 మి.మీ అత్యధితక వర్షపాతం నమోదయిందన్నారు. దస్తూరాబాద్‌లో 1.0, పెంబి 0.8 మి.మీ వర్షం కురిసిందని వెల్లడించారు. రాబోయే 24 గంటల్లో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Similar News

News December 6, 2025

ముఖ్య నేతలకు తలనొప్పిగా మారిన ఎన్నికలు

image

గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రధాన పార్టీల ముఖ్య నాయకులకు తలనొప్పిగా మారాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది నేతల్లో టెన్షన్ మొదలైంది. కొందరు నాయకులు సర్పంచ్,వార్డు స్థానాలకు తమ అనుచరులతో నామినేషన్ వేయించారు. ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ వేయడంతో కార్యకర్తలలో అయోమయం నెలకొంది. నామినేషన్ గడువు ముగిస్తే గాని ఒకే పార్టీ నుంచి ఎందరు అభ్యర్థులు పోటీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది.

News December 6, 2025

ఇండిగో సంక్షోభం వేళ రైల్వే కీలక నిర్ణయం

image

ఇండిగో ఫ్లైట్స్ రద్దు కారణంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లు అనుసంధానించినట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దక్షిణ రైల్వేలో 18 రైళ్లకు అత్యధికంగా కోచ్‌లు పెంచారు. ఉత్తర, పశ్చిమ, తూర్పు, ఈశాన్య రైల్వే జోన్లలో కూడా స్పెషల్ కోచ్‌లు ఏర్పాటు చేశారు. అదనంగా 4 ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నారు.

News December 6, 2025

VZM: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

image

తమిళనాడు రాష్ట్రంలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లాకి చెందిన నలుగురు మృతి చెందారు. రామేశ్వరం వద్ద ఆగి ఉన్న కారును అర్ధరాత్రి 2 గంటల సమయంలో లారీ ఢీకొట్టింది. మృతులు దత్తిరాజేరు, గజపతినగరం మండలాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా శబరిమల నుంచి తిరగివస్తున్నారు. ఘటనకు సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.