News April 10, 2025
నిర్మల్ జిల్లాలో 0.2 మి.మీ వర్షపాతం

నిర్మల్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో 0.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తానూర్‌లో 1.2 మి.మీ అత్యధితక వర్షపాతం నమోదయిందన్నారు. దస్తూరాబాద్‌లో 1.0, పెంబి 0.8 మి.మీ వర్షం కురిసిందని వెల్లడించారు. రాబోయే 24 గంటల్లో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Similar News
News April 18, 2025
మామునూరు ఎయిర్‌పోర్టు.. నెక్స్ట్ ఏంటి?

మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే. ఇందుకు 949ఎకరాలు అవసరమవగా 696ఎకరాలు సేకరించారు. మరో 253ఎకరాల కోసం 3గ్రామాలను ఒప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అక్కడి భూముల ధరలు అమాంతం పెరగడంతో ఎకరాకు రూ.5కోట్లు ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది. దీంతో ఎయిర్‌పోర్టు అంశం పట్టాలు తప్పినట్లేనా అని జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు. సమస్యను క్లియర్ చేసి త్వరగా నిర్మించాలని కోరుతున్నారు.
News April 18, 2025
IPL: అనూహ్య ‘నో బాల్’.. ఎలాగంటే?

నిన్న MI, SRH మ్యాచ్‌లో ఓ అనూహ్య నో బాల్ వెలుగులోకి వచ్చింది. అన్సారీ బౌలింగ్‌లో రికెల్టన్ షాట్ ఆడగా కమిన్స్ క్యాచ్ పట్టారు. అయితే, బ్యాటర్ ఔట్ కాలేదు. దీనికి కారణం నో బాల్. రూల్ ప్రకారం బ్యాట్‌ను బంతి తాకక ముందే కీపర్ గ్లౌవ్స్ స్టంప్స్ కంటే ముందుకొస్తే నో బాల్ ఇస్తారు. నిన్న క్లాసెన్ గ్లౌవ్స్ ఇలాగే ముందుకొచ్చాయి. అయితే, కీపర్ తప్పునకు బౌలర్‌కు శిక్ష ఏంటని పలువురు క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు.
News April 18, 2025
ఎల్లెల్సీకి నిలిచిన నీటి సరఫరా

తుంగభద్ర దిగువ కాలువకు నీటి సరఫరా నిలిచిపోయింది. రెండ్రోజుల క్రితం వరకు నీటి సరఫరా కొనసాగగా తాజాగా పూర్తిగా నిలిపివేశారు. తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వలు తగ్గుముఖం పడటంతో ఉన్నతాధికారుల అదేశాల మేరకు నిలిపివేసిటన్లు సమాచారం. టీబీ డ్యాంలో ప్రస్తుతం 7.037 టీఎంసీల నీరు నిల్వ ఉండగా జలాశయానికి ఎలాంటి ఇన్ ఫ్లో లేదు.