News February 25, 2025
నిర్మల్ జిల్లాలో 19,107 ఎమ్మెల్సీ ఓటర్లు

ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మొత్తం 46 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మొత్తం 19,107 మంది ఓట్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 17,141 మంది పట్టభద్రులు, 1,966 మంది ఉపాధ్యాయులు ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఓటరు గుర్తింపు స్లిప్పుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News March 21, 2025
MBNR: చెట్టుపై నుంచి కిందపడి వ్యక్తి మృతి

ఈనెల 15న చెట్టు ఎక్కి ఆకులు తెంచుతుండగా.. కాలు జారికిందపడి గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు వివరాలు.. అడ్డాకుల మం. పొన్నకల్‌కు చెందిన సత్యం(30) గ్రామ సమీపంలోని చెట్టు ఎక్కి కిందపడ్డారు. ఆయనను కుటుంబసభ్యులు HYDలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
News March 21, 2025
బనగానపల్లెలో నకిలీ వైద్యుడి గుట్టురట్టు.. ఆస్పత్రి సీజ్

బనగానపల్లెలో ఆయుష్ వైద్య అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా బనగానపల్లెలో అనధికారికంగా, వైద్య అర్హతలు లేని నకిలీ వైద్యుడు సూర్య నాయుడును గుర్తించారు. పక్షవాతానికి వైద్యం చేస్తానంటూ ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తున్నాడనే ఫిర్యాదులు అందడంతో ఆయుష్ శాఖ అధికారులు డా.రవికుమార్, వాణి తనిఖీకి వెళ్లగా నకిలీ వైద్యుడు పరారయ్యాడు. ఆయుష్ అధికారులు ఆసుపత్రిని సీజ్ చేశారు.
News March 21, 2025
భీమవరం: ఉద్యోగికి 15 రోజుల రిమాండ్

నిధుల దుర్వినియోగం కేసులో ఉద్యోగిని అరెస్ట్ చేసినట్లు భీమవరం డీఎస్పీ జయసూర్య తెలిపారు. వివరాల్లోకి వెళితే… భీమవరం మండలం చినఅమిరం గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడైన జూనియర్ అసిస్టెంట్ గుండు రామకృష్ణను అరెస్ట్ చేసి రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వద్ద హాజరుపర్చగా 15 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ కాళీచరణ్ తెలిపారు.