News March 31, 2025
నిర్మల్ జిల్లాలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత

నిర్మల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలోని మామడ మండలం తాండ్ర గ్రామంలో సోమవారం 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధకారులు వెల్లడించారు. సారంగాపూర్ మండలం జాం గ్రామంలో 21.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోత్రత నమోదైందన్నారు. కాగా రాష్ట్రంలో అత్యధికంగా ఆసిఫాబాద్లో 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News September 15, 2025
మూసీకి తగ్గిన వరద

మూసీ నదికి వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్ట్లోకి ప్రస్తుతం 4,385.47 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, అంతే మొత్తంలో నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 643.70 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను 4.12 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అధికారులు 3 క్రస్ట్ గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు.
News September 15, 2025
ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు

APPSC 10 తానేదార్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్ 1వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ. 330. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://portal-psc.ap.gov.in/
News September 15, 2025
పాలకోడేరు: గోస్త నదిలో పడి ఒకటో తరగతి విద్యార్థి గల్లంతు

పాలకోడేరు(M) వేండ్ర శివారు కట్టవారిపాలెంకు చెందిన బొక్క శ్రీనివాస్ రావు రెండో కుమారుడు జైదేవ్(7) గోస్త నదిలో పడి ఆదివారం గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవుడూరులోని ప్రైవేట్ స్కూల్లో జైదేవ్ 1వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో తన స్నేహితుడితో కలిసి సైకిల్ తొక్కుతూ గోస్త నది వంతెన మీదకు వెళ్ళగా ప్రమాదవశాత్తు కాలుజారి పడి గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.