News February 9, 2025
నిర్మల్ జిల్లా నేటి TOP NEWS

★ బైంసా: రోడ్డు ప్రమాదంలో 14 ఏళ్ల బాలుడు మృతి ★ నిర్మల్: నులిపురుగుల మాత్రల పంపిణీ వాయిదా ★ రేపు నిర్మల్‌లో గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పర్యటన ★ సిరిపల్లి చెక్ పోస్ట్ వద్ద రూ 1,53,000 నగదు పట్టివేత★ ముధోల్ ఇంటి నిర్మాణం తవ్వకాల్లో ఔరంగజేబు కాలంనాటి నాణేలు
Similar News
News March 27, 2025
మెదక్: ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మనోహరాబాద్ మండలంలో గురువారం జరిగింది. స్థానికుల వివరాలు.. బిహార్‌లోని బాక్సర్ జిల్లా, సిమారికి చెందిన కమలేష్ కుటుంబంతో కలిసి కాళ్లకల్‌లో నివసిస్తున్నాడు. ఇతనికి భార్య మమత ఇద్దరు పిల్లలు కలరు. వెల్డింగ్ వర్క్ చేసుకుంటా జీవనం కొనసాగించేవాడు. ఆర్థిక ఇబ్బందులతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
News March 27, 2025
సంపాదనలో రష్మిక మందన్న టాప్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న రూ.70 కోట్ల ఆస్తులు సంపాదించినట్లు ఫోర్బ్స్ సంస్థ తెలిపింది. త్వరలోనే ఇది రూ.100 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఆమెకు హైదరాబాద్, బెంగళూరు, కూర్గ్, ముంబై, గోవాలో సొంత ఇళ్లు ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వెల్లడించాయి. దక్షిణాదిలో సంపాదనపరంగా రష్మికనే నంబర్‌వన్ అని చెప్పాయి.
News March 27, 2025
ప్రారంభానికి సిద్ధంగా “VMRDA THE DECK”

సిరిపురం నిర్మాణంలో ఉన్న నూతన “VMRDA THE DECK” త్వరలో ఓపెన్ కాబోతుంది. ఇందులో 5 అంతస్తుల్లో పార్కింగ్ సదుపాయం, 6 అంతస్తుల్లో కమర్షియల్‌కి సదుపాయం కల్పించబోతున్నారు. దీని నిర్మాణ అంచనా వ్యయం రూ.87.50 కోట్లు. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. అతి త్వరలో దీనిని ఓపెన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రారంభమయ్యాక పార్కింగ్ సమస్యలు తీరనున్నాయి. ఇందులో 4వీలర్, 2వీలర్ పార్కింగ్ చేసుకోవచ్చు.