News January 27, 2025
నిర్మల్ జిల్లా పురపాలికల ప్రత్యేకాధికారిగా అదనపు కలెక్టర్

నిర్మల్ జిల్లా నిర్మల్, భైంసా, ఖానాపూర్ పురపాలక సంఘాల ప్రత్యేక అధికారిగా జిల్లా అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులను జారీ చేసింది. నేటితో పురపాలక పాలకవర్గ కాలపరిమితి ముగియడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక అధికారులుగా ఆర్డీవోలను నియమిస్తున్నట్లు వార్తలు వచ్చినా.. అదనపు కలెక్టర్లకే ఈ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది
Similar News
News December 9, 2025
ఎంజీఎంలో టెండర్లు ఉండవా ?

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో గుత్తేదారులతో హవా నడుస్తోంది. కాల పరిమితి ముగిసినా టెండర్లు పిలవకపోవడంతో పాత కాంట్రాక్టు సంస్థలకే కట్టబెడుతున్నారు. శానిటేషన్ టెండర్ ముగిసినా గత 3 నెలలుగా వారితోనే సిబ్బంది వేతనాలు కోతలతో చెల్లిస్తున్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. స్టేషనరీ, సర్జికల్, మెడికల్ టెండర్లు పిలవకపోవడంతో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
News December 9, 2025
రాజధానిలో గ్రామకంఠాల సర్వే.. 13 బృందాలు రంగంలోకి

రాజధాని 29 గ్రామాల్లో గ్రామకంఠాల గందరగోళానికి చెక్ పెట్టేందుకు CRDA 13 సర్వే బృందాలను రంగంలోకి దించింది.
రైతులు మినహాయింపుల్లో అవకతవకలు ఉన్నాయంటూ పలుమార్లు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం త్రీమెన్ కమిటీని ఏర్పాటుచేసింది. ప్రతి బృందంలో వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ, సర్వేయర్ ఉంటారు. వారికి శిక్షణ ఇచ్చి త్వరలో గ్రామాల్లో సర్వే ప్రారంభిస్తారు. నివేదికలు అందిన తర్వాత మినహాయింపులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
News December 9, 2025
క్రికెట్ చరిత్రలో ఒకేఒక్కడు.. రస్సెల్

విండీస్ ఆల్రౌండర్ రస్సెల్ చరిత్ర సృష్టించారు. T20లలో 5000+ రన్స్, 500+ సిక్సులు, 500+ వికెట్లు సాధించిన తొలి ప్లేయర్గా ఘనత సాధించారు. అన్ని దేశాల లీగ్లలో కలిపి రస్సెల్ 576 మ్యాచ్లు ఆడారు. మొత్తంగా 9,496 రన్స్, 972 సిక్సర్లు, 628 ఫోర్లు బాదారు. కాగా వ్యక్తిగతంగా 126 మంది 5000+ రన్స్, ఆరుగురు 500+ వికెట్లు, 10 మంది 500+ సిక్సర్లు బాదారు. కానీ ఇవన్నీ చేసిన ఒకేఒక్కడు రస్సెల్.


