News December 17, 2024

నిర్మల్ జిల్లా వాసులకు కలం స్నేహం అవార్డులు

image

కలం స్నేహం ఆధ్వర్యంలో చేపట్టిన బెస్ట్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డులు నిర్మల్ జిల్లా వాసులను వరించింది. హైదరాబాదులోని కూకట్పల్లి జరిగిన కార్యక్రమంలో స్వర స్నేహం బెస్ట్ ఆఫ్ ది ఇయర్ గా నాగరాజు, శ్రీకాంత్, గంగాధర్, రాధికలు అవార్డులు పొందారు. నాట్య స్నేహంలో శ్రీ బెస్ట్ ఆఫ్ ది ఇయర్ గా చిన్నారి ప్రణవలకు అవార్డు లభించింది. వారితోపాటు జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రియ కూడా ఉన్నారు.

Similar News

News February 5, 2025

నిర్మల్: ఇద్దరు ఉపాధ్యాయులపై పోక్సో కేసు: SI

image

నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న <<15345603>>ఉపాధ్యాయులపై<<>> పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిరణ్ బుధవారం తెలిపారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ శాఖ సూపర్‌వైజర్ ఫిర్యాదు చేయడంతో మోహన్ రావ్, మనోహర్ రెడ్డిలపై కేసు నమోదు చేశామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని ఎస్సై పేర్కొన్నారు.

News February 5, 2025

కేయూ: 20 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

image

కేయూ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి జరగనున్నాయని ప్రొఫెసర్ రాజేందర్, ఆచార్య బీఎస్ఎల్ సౌజన్య ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సులకు మొదటి సెమిస్టర్ 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

News February 5, 2025

బెల్లంపల్లి: మావోయిస్టుల లేఖ కలకలం

image

బెల్లంపల్లి ఏరియాలోని శాంతిఖని పాత గనిని ఓపెన్‌కాస్ట్ చేసే ప్రయత్నాలను సింగరేణి విరమించుకోవాలని మావోయిస్టు పార్టీ సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ ప్రకటనలో డిమాండ్ చేశారు. OCగా మారిస్తే పరిసర గ్రామాలతో పాటు బెల్లంపల్లి పట్టణం విధ్వంసానికి గురవుతుందన్నారు. శాంతిఖని ఓసీ నిలిపివేసేందుకు MLA వినోద్, MPవంశీకృష్ణ, కాంగ్రెస్ నాయకులు చొరవ చూపాలన్నారు. లేకపోతే OCలు బొందలగడ్డగా మారుతాయన్నారు.

error: Content is protected !!