News February 5, 2025
నిర్మల్ జిల్లా విద్యార్థినికి యంగ్ డాన్సింగ్ స్టార్ అవార్డు

నిర్మల్ జిల్లాకు చెందిన ఒకటో తరగతి విద్యార్థిని ఆరాధ్య లక్ష్మి యంగ్ డాన్సింగ్ స్టార్ అవార్డు కైవసం చేసుకుంది. జనవరి 22 నుంచి 25 వరకు హైదరాబాదులో నిర్వహించిన ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ 76వ వార్షిక జాతీయ సదస్సులో చక్కని నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఇందుకు ఏఎన్సీఐపీఎస్ ప్రెసిడెంట్ లక్ష్మీకాంత్ చేతుల మీదుగా అవార్డును అందజేశారు. మంగళవారం పాఠశాల యాజమాన్యం విద్యార్థినిని అభినందించింది.
Similar News
News December 2, 2025
ఎన్నికల ఖర్చులకు కొత్త ఖాతా తప్పనిసరి: కలెక్టర్ తేజస్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాల నమోదు కోసం తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా తెరవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి ప్రత్యేక ఖాతా కలిగి ఉండాలన్నారు. మూడో విడతలో నామినేషన్ వేయాలనుకునే వారు ముందుగానే కొత్త అకౌంట్ తీసుకుంటే నామినేషన్ ప్రక్రియ సులభమవుతుందని కలెక్టర్ సూచించారు.
News December 2, 2025
‘పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేశారు’

సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధిఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. రైతులను గాలికి వదిలేసి బోనస్ అని బోగస్ మాటలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<


