News February 5, 2025
నిర్మల్ జిల్లా విద్యార్థినికి యంగ్ డాన్సింగ్ స్టార్ అవార్డు

నిర్మల్ జిల్లాకు చెందిన ఒకటో తరగతి విద్యార్థిని ఆరాధ్య లక్ష్మి యంగ్ డాన్సింగ్ స్టార్ అవార్డు కైవసం చేసుకుంది. జనవరి 22 నుంచి 25 వరకు హైదరాబాదులో నిర్వహించిన ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ 76వ వార్షిక జాతీయ సదస్సులో చక్కని నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఇందుకు ఏఎన్సీఐపీఎస్ ప్రెసిడెంట్ లక్ష్మీకాంత్ చేతుల మీదుగా అవార్డును అందజేశారు. మంగళవారం పాఠశాల యాజమాన్యం విద్యార్థినిని అభినందించింది.
Similar News
News January 14, 2026
NGKL జిల్లా ప్రజలకు కలెక్టర్ భోగి శుభాకాంక్షలు

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రజలకు కలెక్టర్ బాదావత్ సంతోష్ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు. పండుగ వేళ తెలుగు లోగిళ్లు గ్రామీణ శోభతో, అలనాటి అనుభూతులతో కళకళలాడాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ పండుగ సమయానికి తమ గ్రామాలకు చేరుకుని, కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలను భక్తిశ్రద్ధలతో, సంతోషంగా జరుపుకోవాలని కలెక్టర్ కోరారు.
News January 14, 2026
తెలుగు ప్రజలకు మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ సంక్రాంతి మీ జీవితాల్లో సరికొత్త ఆశయాలు, ఉన్నత లక్ష్యాలను నింపాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ పండుగ మన అన్నదాతలది. నిరంతరం శ్రమిస్తూ దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు కృతజ్ఞతలు తెలిపే పవిత్ర సమయం. ఈ సందర్భంగా సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నా’ అని Xలో పోస్ట్ చేశారు.
News January 14, 2026
పితృ దేవతలకు నేడు తర్పణాలు వదిలితే..

మకర సంక్రాంతి ఎంతో పవిత్ర దినం. తండ్రీకొడుకులైన సూర్యశనుల కలయికకు ఇది ప్రతీక. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు విడిచి, పేదలకు అన్నదానం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది. కొత్త కుండలో పాలు పొంగించి సూర్యుడికి నైవేద్యం సమర్పిస్తారు. శని దోష నివారణకు నువ్వులు, బెల్లం, గుమ్మడికాయలు దానం చేస్తారు. పంట చేతికి వచ్చే ఈ ‘కుప్ప నూర్పిడుల పండుగ’ వెలుగును, ఆరోగ్యాన్ని, సిరిసంపదలను ప్రసాదించే గొప్ప వేడుక.


