News March 19, 2025

నిర్మల్: టిప్పర్ కిందపడి ఒకరి దుర్మరణం

image

జిల్లా కేంద్రంలోని గండి రామన్న ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్ఆర్ కాలనీకి చెందిన జవాన్ కరణ్ సింగ్(22) యువకుడు మృతి చెందినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఇద్దరు మిత్రులతో కలిసి చించోలి వెళ్లి తిరిగి వస్తుండగా ఆలయం వద్ద ముందు వెళ్తున్న టిప్పర్ను ఓవర్ టేక్ చేసి కింద పడ్డారు. దీంతో కరణ్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు.

Similar News

News December 9, 2025

సిద్దిపేట: 4 సార్లు ఓటమి.. అయిన సర్పంచ్ బరిలోకి!

image

బెజ్జంకి గ్రామ సర్పంచ్ పదవికి గతంలో నాలుగు సార్లు ఓటమి చెందిన కొండ్ల వెంకటేశం ఈసారి కూడా వెనుదీరగకుండా ఐదవసారి ఎన్నికల రణరంగంలోకి దిగారు. 1995, 2001, 2006, 2019లో ఓటమి చవిచూసిన ఆయన, ఇప్పుడు జరుగుతున్న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో మళ్లీ బరిలోకి రావడం గ్రామంలో చర్చనీయాంశమైంది. తనకు ఉన్న సానుభూతితో తప్పకుండా విజయం సాధిస్తానని వెంకటేశం ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News December 9, 2025

ఉమ్మడి గుంటూరులో స్క్రబ్ టైఫస్

image

గుంటూరు జిల్లా వెనిగండ్ల, నరసరావుపేట మండలం ములకలూరులలో స్క్రబ్ టైఫస్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అనారోగ్యంతో జీజీహెచ్‌లో చేరిన ఇద్దరికీ ఈ వ్యాధి సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు ఆయా గ్రామాల్లో ఫీవర్ సర్వేలు నిర్వహిస్తున్నారు. వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

News December 9, 2025

నంద్యాల: ఘోర ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

డోన్ మండలం కొత్తపల్లి బ్రిడ్జి సమీపంలోని జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందినట్టు స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.