News March 19, 2025
నిర్మల్: టిప్పర్ కిందపడి ఒకరి దుర్మరణం

జిల్లా కేంద్రంలోని గండి రామన్న ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్ఆర్ కాలనీకి చెందిన జవాన్ కరణ్ సింగ్(22) యువకుడు మృతి చెందినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఇద్దరు మిత్రులతో కలిసి చించోలి వెళ్లి తిరిగి వస్తుండగా ఆలయం వద్ద ముందు వెళ్తున్న టిప్పర్ను ఓవర్ టేక్ చేసి కిందపడ్డారు. దీంతో కరణ్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
Similar News
News November 28, 2025
దుగ్గిరాల యార్డులో క్వింటాల్ పసుపు ధర ఎంతంటే.!

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో శుక్రవారం నిర్వహించిన వేలంలో 140 బస్తాల పసుపు విక్రయాలు జరిగాయి. ఈ వేలంలో క్వింటాల్ పసుపు ధర రూ.12,900 పలికింది. కొమ్ముల రకం పసుపు కనిష్ఠ, గరిష్ఠ, మోడల్ ధరలు రూ.12,900గా ఒకే ధర పలకగా, కాయ రకం పసుపు కూడా అదే ధర పలికినట్లు యార్డు అధికారులు తెలిపారు.
News November 28, 2025
జగిత్యాల: ‘రూ.50వేల లోపు నగదుకే అనుమతి’

ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం, ఆయుధాల రవాణాను అడ్డుకునేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో 3 ఎస్ఎస్టీ, 20 ఎఫ్ఎస్టీ టీంలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల నియమాల ప్రకారం 50 వేల రూపాయలలోపు నగదు మాత్రమే అనుమతించబడుతుందని, అంతకంటే ఎక్కువైతే పత్రాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.
News November 28, 2025
NRPT: ‘ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయండి’

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) అమలులో ఉందని, ఎవరైనా ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08506-283122కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. రాజకీయ నాయకులు, అభ్యర్థులు, అధికారులు తప్పనిసరిగా ఎన్నికల నియమావళి పాటించాలని ఆమె స్పష్టం చేశారు.


