News January 27, 2025

నిర్మల్: టీజీపీఎస్సీ పరీక్షా నిర్వాహకులకు ప్రశంసాపత్రాలు

image

నిర్మల్ జిల్లాలో టీజీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించినందుకు కోఆర్డినేటర్స్ డా.పీజీ రెడ్డి, డా. యూ.రవి కుమార్‌ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అభినందించారు. వారికి గణతంత్ర వేడుకల సందర్భంగా ఉత్తమ ప్రశంసాపత్రాల్ని అందజేశారు. కాగా వీరు జీఆర్పీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో(భైంసా) హిస్టరీ, ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌గా పనిచేస్తున్నారు. కళాశాల అధ్యాపకుల బృందం వీరిని అభినందించారు.

Similar News

News November 5, 2025

కర్నూలు జిల్లాలో SIల బదిలీలు: SP

image

కర్నూలు జిల్లాలో SIల బదిలీలు చేపట్టినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం బదిలీల ఉత్తర్వులు జారీ చేశారు. గూడూరు SI అశోక్‌‌ను కర్నూలు తాలూకా PSకు, SI ఎం.తిమ్మయ్యను కర్నూలు 3 టౌన్‌ నుంచి కర్నూలు 2 టౌన్‌కు, SI జి.హనుమంత రెడ్డిని 2 టౌన్‌ నుంచి గూడూరుకు, SI ఏసీ పీరయ్యను కర్నూలు తాలూకా PS నుంచి కర్నూలు 3 టౌన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News November 5, 2025

ఉసిరి దీపాన్ని ఎలా తయారుచేసుకోవాలి?

image

కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టడం అత్యంత పవిత్రమైన ఆచారం. ఈ దీపాన్ని వెలిగించడానికి గుండ్రని ఉసిరికాయను తీసుకుని, దాని మధ్య భాగంలో గుండ్రంగా కట్ చేయాలి. ఆ భాగంలో స్వచ్ఛమైన నూనె లేదా ఆవు నెయ్యి వేయాలి. ఆ నూనెలో వత్తి వేసి వెలిగించాలి. ఇలా ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల సకల దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నవగ్రహ దోషాలు తొలగి ఇంట్లో సుఖశాంతులు చేకూరుతాయని భక్తుల నమ్మకం.

News November 5, 2025

ఉపరితల ఆవర్తనంతో ఈ జిల్లాల్లో వర్షాలు!

image

కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ APలోని కోనసీమ, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, NLR, కర్నూలు, కడప, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు TGలో ఇవాళ్టితో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో వర్షాలు ముగుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.