News April 22, 2025
నిర్మల్: టెలిఫోన్‌లో ప్రజావాణి.. వాట్సప్‌లో రసీదులు

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగానికి జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారుల తరలివచ్చారు. స్థానిక సంస్థల ప్రాథమిక కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఫిర్యాదులను స్వీకరించారు. ముఖ్యంగా పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలపై ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. దాంతోపాటు అధిక ఉష్ణోగ్రతల వల్ల రాలేని వారి కోసం టెలిఫోన్‌లోను ఫిర్యాదుల స్వీకరణ చేసి రసీదులను 9100577132 వాట్సప్‌లో పంపించామన్నారు.
Similar News
News April 22, 2025
రేపే హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు

జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లు తమ ఓ హక్కును వినియోగించుకోనున్నారు. ఈనేపథ్యంలో బుధవారం జరగబోయే ఎన్నికలకు సంబంధించిన జీహెచ్ఎంసీ ముమ్మురమైన ఏర్పాటు చేస్తోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తున్నారు.
News April 22, 2025
ALERT: భక్తులకు TTD కీలక సూచన

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈక్రమంలో భక్తులకు TTD కీలక సూచన చేసింది. చాలా మంది తమకు కేటాయించిన టైమ్ స్లాట్‌కు బదులు ముందే వచ్చి క్యూలో నిల్చుంటున్నారని మండిపడింది. రద్దీ అధికంగా ఉండటంతో ఇలా చేయడం సరికాదని, కేటాయించిన టైమ్‌కు మాత్రమే రావాలని సూచించింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలోనే భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
News April 22, 2025
నారాయణపేట జిల్లా వైద్యాధికారిగా డా.జయచంద్ర మోహన్

నారాయణపేట DMHOగా డాక్టర్ చంద్రమోహన్‌ను నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన ఇదివరకు ప్రభుత్వ వైద్య కళాశాలలో RMOగా పనిచేసి, ఇక్కడికి బదిలీ అయ్యారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగుల నియామకంలో అవినీతి, అక్రమాలు జరిగినట్లు పలు పత్రికల్లో వార్తలు రావడంతో ఆరోగ్యశాఖ ఇక్కడ పనిచేస్తున్న DMHO సౌభాగ్యలక్ష్మిని HYD హెడ్ ఆఫీస్‌కి అటాచ్ చేశారు.