News February 9, 2025
నిర్మల్: ట్రంప్ చర్యలను ఖండించిన CPI (ML)

భారతీయులకు బేడీలు వేసి పంపిస్తున్న ట్రంప్ దురహంకార చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని (సీపీఐ ఎంఎల్)మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కే.రాజన్న పిలుపునిచ్చారు. ఆదివారం నిర్మల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దురహంకార ధోరణితో చేస్తున్న అకృత్యాలను ప్రధాని మోదీ ఖండించకపోవడం శోచనీయమన్నారు. ఇందులో జిల్లా కార్యదర్శి నంది రామయ్య నాయకులు గఫూర్, గంగన్న, బక్కన్న ఉన్నారు.
Similar News
News March 8, 2026
అబ్దుల్ అజీజ్ తల్లి మృతి.. MP నివాళి

AP వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ మాతృమూర్తి అన్వర్ జాన్ మృతి తమకు ఆవేదన కలిగించిందని MP వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి అన్నారు. శనివారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో MP దంపతులు నెల్లూరులోని అబ్దుల్ అజీజ్ ఇంటికి వెళ్లి అన్వర్ జాన్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
News March 8, 2026
మహబూబాబాద్: గర్భాశయ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ పోస్టర్ ఆవిష్కరణ

14 ఏళ్లలోపు బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణకు అందించే HPV వ్యాక్సిన్ పోస్టర్‌ను మహబూబాబాద్ కలెక్టరేట్‌లో కలెక్టర్ స్నేహ శబరీష్ ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా 6,670 మంది బాలికలు ఈ వ్యాక్సినేషన్‌కు అర్హులుగా ఉన్నారని తెలిపారు. ఆదివారం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి, తొర్రూరు, గూడూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
News March 8, 2026
మహబూబాబాద్: లైసెన్స్‌డ్ సర్వేయర్లకు సర్టిఫికెట్ల ప్రదానం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భూభారతి’ చట్టం అమలులో భాగంగా ఆరు నెలలుగా కఠిన శిక్షణ, అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శనివారం లైసెన్స్ సర్టిఫికెట్లను అందజేశారు. కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశాల మేరకు అడిషనల్ డైరెక్టర్ నూర్ సింగ్ ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. భూ సర్వే ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు ఈ లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.


