News April 3, 2025
నిర్మల్: డబుల్ రేట్లకు అమ్ముతున్నారు..!

నిర్మల్లో స్టాంప్ వెండర్లు ఇష్టారాజ్యాంగా రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 10కి పైగా ఉన్న స్టాంప్ వెండర్లు రిజిస్ట్రార్ డిపార్ట్మెంట్ నిబంధనలు లెక్కచేయకుండా స్టాంపు పేపర్ల విక్రయాలు చేపడుతున్నారు. రూ.20ల బాండ్ను రూ.40-50కి విక్రయిస్తున్నారు. దీనిపై నిర్మల్ సబ్ రిజిస్ట్రర్ రవికిరణ్ను వివరణ కోరగా స్టాక్ లేని విషయం వాస్తవమేనన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Similar News
News October 24, 2025
నిర్మల్: ‘ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులుంటే కాల్ చేయండి’

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సన్న, దొడ్డు రకాలకు వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. తూకపు యంత్రాలకు స్టాంపింగ్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. రైతులు ఇబ్బందులు పడకుండా టార్పాలిన్లు, సంచులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. రైతులకు ఏవైనా సమస్యలుంటే 91829 58858కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.
News October 24, 2025
పల్నాడు: అవిశ్వాసానికి వేళాయె..!

మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల పదవి కాలం 4 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పల్నాడు జిల్లాలో పలుచోట్ల అవిశ్వాస తీర్మానాలు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తూ ఉండటంతో రాజకీయ అలజడి ప్రారంభమైంది. కారంపూడిలో ఇప్పటికే అవిశ్వాసం ఆమోదం పొందడంతో ఎంపీపీ మేకల శారద పదవి కోల్పోయారు. ముప్పాళ్ల ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి సభ్యులు నోటీసులు ఇచ్చారు. మరి కొన్ని చోట్ల ఇవే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
News October 24, 2025
కర్నూలు ప్రమాద ఘటనపై Dy.CM భట్టి దిగ్ర్భాంతి

కర్నూల్ జిల్లా బస్సు ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్ రోడ్డు ప్రమాదంలో మంటలు అంటుకొని పలువురు సజీవ దహనమైన విషయాన్ని తెలుసుకున్న భట్టి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.


