News December 10, 2024

నిర్మల్: తండ్రిని కొట్టి, ఉరేసి చంపిన కొడుకు

image

తండ్రిని కొడుకు చంపిన ఘటన నిర్మల్‌లో జరిగింది. SI లింబాద్రి వివరాల ప్రకారం.. ముఠాపూర్‌కు చెందిన ముత్యం(47) ఆదివారం రాత్రి తన తల్లిని మద్యం కోసం డబ్బులివ్వాలని కొట్టాడు. అప్పుడే ఇంటికి వచ్చిన ముత్యం కొడుకు మణిదీప్ నానమ్మను కొట్టాడనే కోపంతో తండ్రిని చితకబాదాడు. కోపం తగ్గకపోవడంతో చీరతో ఉరేసి చంపాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వృద్ధురాలిని ఆరాతీయడంతో విషయం బయటపడినట్లు SI వెల్లడించారు.

Similar News

News January 20, 2025

NRML: కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

image

NRML జిల్లా <<15204489>>బాసర గోదావరి<<>> నదిలో దూకి శివరాం(62) మృతిచెందినట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. NZB జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటకు చెందిన శివరాం పెద్దకొడుకు 2ఏళ్ల కింద మరణించారు. మనస్తాపం చెందిన శివరాం ఇంటి వద్ద రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించగా కుటుంబీకులు కాపాడారు. సోమవారం బాసరకు వచ్చి గోదావరిలో దూకారు. పోలీసులు గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. శివరాం చిన్నకొడుకు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు.

News January 20, 2025

రేపు ఆదిలాబాద్ ఆకాశవాణిలో ఫోన్ ఇన్

image

ADB ఆకాశవాణి కేంద్రంలో మంగళవారం “కీరదోస సాగులో మెళకువలు” గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా.వి.మురళీతో ఫోన్ఇన్ నిర్వహించనున్నట్లు ప్రోగ్రాం హెడ్ తెలిపారు. రైతులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆయన సమాధానిలిస్తారని పేర్కొన్నారు. రైతులు మంగళవారం రాత్రి 7.15 నుంచి 7.45 వరకు 08732-295081, 230081 నంబర్లలో సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు.

News January 20, 2025

ఇంద్రవెల్లి: ప్రకృతి ప్రేమికులు ఆదివాసులు

image

ప్రకృతిని, అడవిని దైవంగా భావిస్తూ ఆదివాసులు ప్రత్యేక పూజలు చేస్తారు. నాగోబా మహా జాతర ప్రారంభమవుతున్న వేళ ఆదివాసులు ఇంద్రాయి, నాగోబా, జంగుబాయి దేవతలకు పూజలు చేస్తారు. గంగాజలం తీసుకువెళ్లే మెస్రం వంశీయులు మొదట ఇంద్రాయి దేవతకు పూజలు చేస్తారు. అనంతరం గోదావరి జలాలతో నాగోబాకు పూజలు చేసి జాతరను ప్రారంభిస్తారు. జాతర పూర్తయిన తర్వాత ఆదివాసులు జంగుబాయిని దర్శించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.