News April 1, 2025

నిర్మల్: తెల్ల రేషన్‌కార్డుదారులందరికీ సన్న బియ్యం: కలెక్టర్

image

తెల్ల రేషన్‌కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించిందని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఆదర్శనగర్‌లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ప్రభుత్వం అందించే పోర్టిఫైడ్ రేషన్ బియ్యంలో అత్యధిక విలువలున్న పోషకాలు, విటమిన్లు ఉంటాయన్నారు. ఇందులో తహాశీల్దార్ రాజు, ఆర్ఐ వెంకటరమణ ఉన్నారు.

Similar News

News December 1, 2025

తగ్గుతున్న GST ఆదాయ వృద్ధి!

image

TG: రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం క్రమేణా తగ్గుముఖం పడుతోంది. NOVలో ₹3910 కోట్ల GST వసూలైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2024 NOVలో వచ్చిన ₹3880 కోట్ల ఆదాయంతో పోలిస్తే దాదాపు 1% పెరిగింది. అయితే అయితే ఇటీవల గణాంకాలను పరిశీలిస్తే నెలనెలా పెరగాల్సిన ఆదాయం తగ్గుముఖం పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు. GST-2.O అమలు చేసినప్పటి తరువాత నుంచి ఈ పరిస్థితి కనిపిస్తోందని వారు చెబుతున్నారు.

News December 1, 2025

నిపుణులతో తరగతుల నిర్వహణ: దీపక్ తివారి

image

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు నిపుణుల ద్వారా తరగతులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ జిల్లా విద్యాధికారి దీపక్ తివారి సూచించారు. సోమవారం ASF జిల్లా కలెక్టరేట్‌లో పీఎం శ్రీ పాఠశాలల హెచ్ఎమ్‌లతో సమీక్ష నిర్వహించారు. పీఎం శ్రీ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇచ్చే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.

News December 1, 2025

మెదక్: నామినేషన్ల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

image

పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసేందుకు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. మెదక్, శంకరంపేట్–ఆర్, రామాయంపేట్ ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్ కేంద్రాల భద్రత, బందోబస్తు, పర్యవేక్షణ వ్యవస్థలను సమీక్షించారు. రద్దీ నియంత్రణ, శాంతిభద్రతలు కఠినంగా పాటించాలని అధికారులకు ఆదేశించారు. SP వెంట డీఎస్పీ నరేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.