News March 12, 2025
నిర్మల్: ‘దివ్యాంగుల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి’

ప్రభుత్వం నూతన పథకాలను ప్రవేశపెట్టి దివ్యాంగుల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సమగ్ర శిక్ష, విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేశామన్నారు.
Similar News
News March 13, 2025
HYD: యువతుల మధ్య వాగ్వాదం.. కేసు నమోదు

యువతిపై ఫిలింనగర్ PSలో అట్రాసిటీ కేసు నమోదైంది. టోలిచౌకిలో ఒకే రూమ్లో ఉంటున్న తనను మరో యువతి మానసిక వేదనకు గురిచేస్తోందని, ప్రశ్నిస్తే యువకులను తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేయసాగిందని బాధితురాలు తెలిపింది. ఇటీవల ఓ యువకుడికి తన ఫోన్తో మెసేజ్ చేసిందని, నిలదీస్తే ‘నిన్ను రేప్ చేయించి.. మర్డర్ చేయిస్తా’అంటూ బెదిరించిందని ఆమె వాపోయింది. ఈ మేరకు బాధితురాలు PSలో ఫిర్యాదు చేసింది.
News March 13, 2025
పిఠాపురంలో పవన్ ఫొటో వైరల్

పిఠాపురం(చిత్రాడ)లో రేపi జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. ఈ సభకు జయకేతనం అని పేరు పెట్టారు. పిఠాపురం, కాకినాడ, జిల్లా వ్యాప్తంగా ఎటు చూసినా జనసేన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. పవన్ను ఆకట్టుకోవడానికి కొందరు వినూత్నంగా పోస్టర్లును ఏర్పాటు చేశారు. ‘రాయల వారి రాజ్యం.. పవన్ అన్నకే సాధ్యం’ అంటూ పవన్ ఫొటోను ఓ వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు రూపంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.