News January 19, 2025
నిర్మల్: దైవ దర్శనానికి వెళ్తుండగా యాక్సిడెంట్

నిర్మల్ జిల్లాలో<<15191861>> రోడ్డు ప్రమాదం<<>> రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. MHలోని జబల్పూర్‌కు చెందిన సమిత(53), విజయ్(57), నితిన్, అనిత, సుదీర్ శ్రీశైలం దర్శనానికి కారులో వెళ్తున్నారు. మామడ మండలం బూర్గుపల్లి సమీపంలో హైవేపై అడ్డొచ్చిన కోతులను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో సమిత, విజయ్ స్పాట్‌లోనే చనిపోగా మిగతా ముగ్గురు గాయపడ్డారు. దర్శనానికి వెళ్తుండగా 2 కుటుంబాల్లో ఒక్కొక్కరు చనిపోవడం విషాదకరం.
Similar News
News February 11, 2025
ADB ఐటీ టవర్ పనులను పూర్తి చేయాలి : మాజీ మంత్రి

ఆదిలాబాద్ జిల్లాకు మంజూరైన ఐటీ టవర్ అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న కోరారు. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి జయేశ్ రంజన్ ను హైదరాబాద్‌లో సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఐటీ పరిశ్రమలను పట్టణాలకు విస్తరించాలని గత ప్రభుత్వం జిల్లాకు 2022లో ఐటీ టవర్ మంజూరు చేసిందన్నారు. కానీ ఇప్పటికి పనులు పూర్తి కాలేదన్నారు.
News February 11, 2025
రేషన్ కార్డు డేటా ఎంట్రీ 2రోజుల్లో పూర్తి చేయాలి: కలెక్టర్

రేషన్ కార్డు డేటా ఎంట్రీ, ఇందిరమ్మ ఇళ్లు, పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణలపై సోమవారం ADB కలెక్టర్ రాజర్షిషా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ కార్డులు, ఇందిరమ్మఇళ్లకు సంబంధించి ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం పూర్తి వివరాలను డేటా ఎంట్రీ రెండురోజుల్లో పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత తహశీల్దార్లపై చర్యలు తీసుకుంటామన్నారు.
News February 10, 2025
ADB: పత్తి కొనుగోళ్లు తాత్కాలికంగా బంద్

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపి వేసినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు సోమవారం తెలిపారు. రైతుల ఆధార్ వెరిఫికేషన్‌లో పలు సాంకేతిక సమస్యల రీత్యా కొనుగోళ్లు నిలిపివేసినట్లు వెల్లడించారు. తర్వాత కొనుగోళ్లు తేదీని వెంటనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ విషయమై రైతులు సహకరించాలని కోరారు.