News April 8, 2025
నిర్మల్: నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ బస్ కండక్టర్

నిర్మల్ డిపోకు చెందిన బస్ కండక్టర్ ఆర్.గంగాధర్ నిజాయితీని చాటుకున్నారు. పర్సు మరిచిపోయిన ప్రయాణీకుడి వివరాలు తెలుసుకోని అప్పగించాడు. నిర్మల్ నుంచి భైంసాకు వెళ్తున్న బస్సులో శివకుమార్ అనే వ్యక్తి పర్సును మరిచిపోయి దిగిపోయాడు. కండక్టర్ శివకుమార్ సీటులో ఉన్న పర్సును గమనించి ఫోన్ నంబర్ ఆధారంగా ప్రయాణీకుడిని పిలిపించి పర్సును అందజేశాడు. నిజాయితీ చాటుకున్న కండక్టర్ ను డిపో మేనేజర్ అభినందించారు.
Similar News
News October 26, 2025
యాడికి: బైక్ను ఢీకొన్న బొలెరో.. వ్యక్తి మృతి

యాడికి మండలం రాయలచెరువులోని పెట్రోల్ బంకు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాయలచెరువుకు చెందిన పుల్లయ్య మోడల్ స్కూల్లో వాచ్మెన్గా పనిచేసే పుల్లయ్య మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఇంటి నుంచి బైక్పై మోడల్ స్కూల్కు బయలుదేరాడు. వెనుక నుంచి బొలెరో ఢీ కొంది. ప్రమాదంలో పుల్లయ్య మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News October 26, 2025
ఏయూ విద్యార్థులకు 2 రోజులు సెలవులు

తుఫాన్ నేపథ్యంలో ఏయూ క్యాంపస్ కళాశాలల విద్యార్థులకు ఈనెల 27, 28వ తేదీల్లో తరగతులను రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ కె.రాంబాబు తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని 2 రోజులపాటు సెలవులు ప్రకటించామని, విద్యార్థులు హాస్టల్స్లో సురక్షితంగా ఉండాలని సూచించారు. అటు అనకాపల్లి జిల్లాలో 29 వరకు కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
News October 26, 2025
ఎన్టీఆర్: రేపటితో ముగియనున్న గడువు

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(NMMS) పరీక్షకై నమోదు చేసుకున్న విద్యార్థులు సోమవారంలోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయం తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ 7న NMMS పరీక్ష నిర్వహిస్తామని, ఈ నెల 31లోపు DEO అధికారి ఎన్టీఆర్ జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల దరఖాస్తులు ధృవీకరిస్తారని పేర్కొంది. https://portal.bseap.orgలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చంది.


