News August 6, 2024
నిర్మల్: నిన్న మిస్సయ్యాడు.. నేడు శవమై కనిపించాడు

నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. నిన్న అదృశ్యమైన ఓ వ్యక్తి ఇవాళ చెరువులో శవమై కనిపించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉమార్ అనే వ్యక్తి నిన్నటి నుంచి కనిపించకుండా పోయాడు. అయితే ఇవాళ అతని శవం స్థానికులకు చెరువులో కనిపించింది. దీంతో వారు మృతుడి కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించారు.
Similar News
News February 12, 2026
ADB: ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చూసుకోవాలి: SP

ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా కృషి చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్న సమయంలో దొంగతనాలు జరగకుండా ఉంటాయన్నారు. ఒక వేళ జరిగినప్పుడు వాటిని చేధించడంలో ఉపయోగపడతాయన్నారు. పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ వివిధ రకాల స్వచ్ఛంద సంస్థల ద్వారా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తుందన్నారు.
News February 12, 2026
ADB: ఓటర్ల చెంతకు వాహనం.. కలెక్టర్ రాజర్షి షా చొరవ

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రతి ఓటరు తన ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు పోలింగ్ కేంద్రాలకు సులభంగా చేరుకునేలా ఉచిత వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఓటర్లను ఇంటి వద్ద నుంచే పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి, తిరిగి సురక్షితంగా ఇంటికి చేర్చారు.
News February 11, 2026
బోథ్ అడవుల్లో పులుల సంచారం

బోథ్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి, చిరుత సంచారం కలకలం రేపుతోంది. పుణ్య నాయక్ తండాలో పవర్ సక్రుకు చెందిన ఆవుపై పులి దాడి చేసి చంపింది. అటవీ అధికారులు ప్రశాంత్ పాటిల్, విశ్వనాధ్ రెడ్డి ఘటనా స్థలిని పరిశీలించారు. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, విద్యుత్ కంచెలు వేయవద్దని హెచ్చరించారు. అటవీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


