News February 26, 2026
నిర్మల్ నుంచి ‘పూరి’కి SPECIAL బస్సు

నిర్మల్ నుంచి ఒడిశాలోగల పూరి జగన్నాథ్ ఆలయానికి ప్రత్యేక బస్సును నడుపుతున్నట్లు డిపో మేనేజర్ పండరి తెలిపారు. ఈ బస్సు MAR 8న నిర్మల్ నుంచి మ.2 గంటలకు బయలుదేరి 9న అన్నవరం, సింహాచలం, అర్సవెల్లి దర్శనాల అనంతరం పూరిలో బస ఉంటుందన్నారు. 10న జగన్నాథుడి దర్శనం, కోనార్క్ సూర్య దేవాలయ దర్శనం అనంతరం విశాఖపట్నం నుంచి ద్వారకా తిరుమల వెళ్తుందన్నారు. తిరిగి నిర్మల్‌కు 13వ తేదీన బస్సు చేరుకుంటుందని పేర్కొన్నారు.
Similar News
News April 19, 2026
గ్రేటర్ జోన్‌లో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్

గ్రేటర్ జోన్‌లో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. గత రెండు రోజులుగా అత్యధికంగా 99 నుంచి 100 మిలియన్ యూనిట్లు నమోదవుతోంది. సాధారణంగా వేసవి తీవ్రత పెరిగే మే నెలలో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుతుంది. ఈ సారి ఉష్ణోగ్రతలు ముందుగానే పెరగడం, వాణిజ్య, గృహ వినియోగం అధికం కావడం వల్ల మార్చి ప్రారంభంలోనే రికార్డు స్థాయి డిమాండ్ నమోదైంది.

హైదరాబాద్: ప్రతి ఒక్కరూ 20% నీటిని ఆదా చేయాలి

వేసవి దృష్ట్యా వచ్చే 45 రోజులు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ 20 శాతం నీటిని ఆదా చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి కోరారు. నగరంలో నీటి సరఫరాపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గత నాలుగేళ్లతో పోలిస్తే ట్యాంకర్ల డిమాండ్ భారీగా పెరిగిందని, సరఫరా 52 వేల నుంచి లక్షా 8 వేలకు చేరిందన్నారు. కేవలం 20 శాతం ప్రాంతాల్లోనే అధిక డిమాండ్ ఉందని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.