News December 29, 2024
నిర్మల్: ‘నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి’
నిర్మల్ ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. డిసెంబర్ 31న జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తారని గంజాయి, డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగవద్దని, మైనర్లు వాహనాలు నడపవద్దని, గుంపులు గుంపులుగా రోడ్లపై తిరగవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
Similar News
News January 6, 2025
కాంగ్రెస్కు ఆదిలాబాద్ సెంటిమెంట్
ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమీక్ష సోమవారం నిర్వహించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాను సెంటిమెంట్గా భావిస్తున్న కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కాగా టీపీసీసీ ఛీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఎన్నికల కార్యాచరణపై దిశానిర్ధేశం చేయనున్నారు.
News January 6, 2025
ADB: మాంజాతో గొంతులు తెగుతున్నాయ్.. జాగ్రత్త.!
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతుంటాయ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎగరవేస్తుంటారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొందరు కైట్స్ ఎగరవేయడానికి చైనా మాంజా వాడుతుండటంతో రోడ్లపై వెళ్లే వారికి అవి ప్రమాదకరంగా మారాయి. గతంలో చైనా మాంజాతో గొంతులు తెగి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. కాగా, చైనా మాంజాలు వాడినా, విక్రయించినా చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
News January 6, 2025
సారంగాపూర్: డిసెంబర్ 31న గొడవ.. కత్తితో పొడిచారు
ఓ యువకుడిపై హత్యాయత్నం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. CI రామకృష్ణ వివరాలు.. సారంగాపూర్ మండలం బోరేగాం గ్రామానికి చెందిన షేక్ అర్షద్, సాయికుమార్, మరో బాలుడు డిసెంబర్ 31న గొడవపడ్డారు. అది మనసులో పెట్టుకున్న సాయికుమార్ సదరు బాలుడితో కలిసి ఈనెల 4న అర్షద్ను గ్రామంలోని ఓ కూడలి వద్దకు రప్పించి కత్తితో పొడిచి పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు.