News December 29, 2024

నిర్మల్: ‘నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి’

image

నిర్మల్ ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. డిసెంబర్ 31న జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తారని గంజాయి, డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగవద్దని, మైనర్లు వాహనాలు నడపవద్దని, గుంపులు గుంపులుగా రోడ్లపై తిరగవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.

Similar News

News January 13, 2025

బ్యాంకు సామగ్రి చోరీకి యత్నం.. ఒకరికి రిమాండ్: CI

image

ఆదిలాబాద్ కలెక్టరేట్‌లోని SBI బ్యాంకు సామగ్రిని చోరీ చేయటానికి ఆదివారం దుండగులు యత్నించినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. ఇద్దరు దుండగులు బ్యాంకు పాత ఫర్నీచర్, నగదు లెక్కించే చెడిపోయిన యంత్రం చోరీకి ప్రయత్నిస్తుండగా.. వాచ్మెన్ నర్సింలు గమనించారు. ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో వారు పరారయ్యారు. వీరిలో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.

News January 13, 2025

కోటపల్లి: కోడి పందెం స్థావరంపై పోలీసుల దాడులు

image

కోటపల్లి మండలంలోని నాగంపేట బొప్పారం గ్రామ శివారున ఉన్న అటవీ ప్రాంతంలో కోడిపందేల స్థావరంపై ఆదివారం ఎస్సై రాజేందర్ సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఎస్సై కథనం ప్రకారం.. దాడుల్లో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే 10 కోళ్లు, 7 మొబైల్స్ రూ.59,780 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4 బైక్‌లు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు SI తెలిపారు.

News January 13, 2025

నేడు ఆసిఫాబాద్ జిల్లాకు మంత్రి సీతక్క రాక

image

రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సోమవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు రానున్నట్లు మంత్రి పీఏ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు రెబ్బన, వాంకిడి, కెరమెరి మండలాల్లో జంగు బాయి దేవత సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. అక్కడ నుంచి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.