News April 2, 2025
నిర్మల్: నేటితో ముగియనున్న పది పరీక్షలు

నిర్మల్ జిల్లాలో గత నెల మార్చి 21న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు నేటీతో ముగియనున్నాయి. పది పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 43 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. నేడు సాంఘిక శాస్త్రం పరీక్షతో పది పరీక్షలు ముగియనున్నాయి.
Similar News
News April 5, 2025
నారాయణపేట జిల్లా ప్రజలకు WARNING

సైబర్ మోసగాళ్ల మాయమాటలు నమ్మొద్దని, కేటుగాళ్లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేశ్ గౌతమ్ శుక్రవారం హెచ్చరించారు. సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా టోల్ ఫ్రీ 1930 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఆన్లైన్లో https://www.cybercrime.gov.in సైతం ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. అపరిచితులకు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వకూడదన్నారు. SHARE IT
News April 5, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 5, 2025
గద్వాల: నకిలీ సీడ్స్ రాకుండా నియంత్రించాలి: డీజీపీ

రాబోయే వర్షా కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ సీడ్స్ జిల్లాలోకి రాకుండా నియంత్రించాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణా శాఖ వారితో సమన్వయం చేసుకుంటూ ప్రివెంటివ్ చర్యలు చేపట్టాలని డీజీపీ డా.జితేందర్, పోలీస్ అధికారులను ఆదేశించారు. ధరూర్ పోలీస్ స్టేషన్ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం గద్వాల జిల్లా పోలీస్ అధికారులతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీజీపీ పాల్గొని మాట్లాడారు.