News April 2, 2025
నిర్మల్: నేటితో ముగియనున్న పది పరీక్షలు

నిర్మల్ జిల్లాలో గత నెల మార్చి 21న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు నేటీతో ముగియనున్నాయి. పది పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 43 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. నేడు సాంఘిక శాస్త్రం పరీక్షతో పది పరీక్షలు ముగియనున్నాయి.
Similar News
News April 20, 2025
విశాఖ: ఒంటరితనం భరించలేక సూసైడ్

ఒంటరితనం భరించలేక ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో ఆదివారం చోటు చేసుకుంది. పీఎం పాలెం సెకండ్ బస్టాప్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్‌లో మృతుడు నివస్తున్నాడు. తల్లిదండ్రులు, అన్నయ్య మృతి చెందడంతో ఒంటరిగా ఉన్న ఆయన మానసికంగా బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం KGHకి తరలించారు.
News April 20, 2025
రేపు ఈ ప్రాంతాల వారు జాగ్రత్త

AP: రేపు రాష్ట్ర వ్యాప్తంగా 51 మండలాల్లో <
News April 20, 2025
తెలుగు ప్రజలకు రుణపడి ఉంటాను: సీఎం చంద్రబాబు

AP: తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినవారందరికీ CM చంద్రబాబు ట్విటర్లో ధన్యవాదాలు తెలిపారు. ‘మీరు అందించిన శుభాకాంక్షలు, చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది. 75 ఏళ్ల నా జీవన ప్రయాణంలో, 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నాకు తోడునీడగా ఉండి, ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రజాసేవ చేసేందుకు నాలుగోసారి అవకాశమిచ్చిన తెలుగు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని పేర్కొన్నారు.