News March 27, 2025
నిర్మల్: నేటి నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్

కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో గురువారం నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేయనున్నట్లు DMHO డా.రాజేందర్ తెలిపారు. గతంలోనే అన్ని ఆరోగ్య కేంద్రాల్లో బయోమెట్రిక్ ద్వారా హాజరును పర్యవేక్షించాల్సి ఉండగా సాంకేతిక ఇబ్బందుల వల్ల నిలిపివేశామని, కాగా నేటి నుంచి మళ్లీ బయోమెట్రిక్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
Similar News
News October 28, 2025
ఆ వ్యాయామాలతో బ్రెస్ట్ క్యాన్సర్ కట్టడి

మహిళల్లో వేగంగా విస్తరిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను 30 శాతం వరకూ తగ్గించడంలో రెసిస్టెన్స్ ట్రైనింగ్, హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వ్యాయామాలు పనిచేస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ వ్యాయామాల వల్ల మయోకిన్స్ రిలీజై రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను 30 శాతం వరకు నెమ్మదిస్తుందని తేలింది.
News October 28, 2025
ఆదిలాబాద్: ‘రక్తదానానికి కుల మతాలకు సంబంధం లేదు’

భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామానికి చెందిన యువకుడు షేక్ ఆఫ్రోజ్ రక్తదానం చేసి ఉదారతను చాటారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన శ్రీరామోజీవార్ అనిల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రక్తం అవసరమవగా స్పందించిన షేక్ ఆఫ్రోజ్ మంగళవారం గాంధీ ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేశారు. రక్తదానానికి కుల మతాలకు సంబంధం లేదన్నారు.
News October 28, 2025
ఇసుక రవాణా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరగాలి- కలెక్టర్

జిల్లాలో ఎక్కడైనా అక్రమ ఇసుక రవాణా జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో స్థానిక అవసరాల మేరకు ఇసుక వినియోగం పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.


