News January 25, 2025
నిర్మల్: నేటి నుంచి రోజూ 2 గంటల కరెంట్ కట్

జిల్లాలో ఈనెల 25 నుంచి రోజూ 2 గంటల పాటు విద్యుత్ సరఫరాలకు అంతరాయం కలుగుతుందని నిర్మల్ విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్ సుదర్శనం శుక్రవారం తెలిపారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 వరకు కరెంట్ ఉండదన్నారు. వ్యవసాయ పొలాలకు నిరంతరాయం విద్యుత్ అందించే ఉద్దేశంతో రూ.5కోట్ల వ్యయంతో 160 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Similar News
News December 4, 2025
తొలి విడత.. ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్!

TG: రాష్ట్రంలో మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అభ్యర్థులకు తెలుగు అక్షర క్రమం ఆధారంగా EC గుర్తులు కేటాయించింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి 30 మంది సర్పంచ్లు ఏకగ్రీవమైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. మొత్తంగా 400కుపైగా స్థానాలు ఏకగ్రీవమవుతాయని అంచనా వేశాయి. రెండో విడతలో 4,332 సర్పంచ్ స్థానాలకు 28,278 మంది, 38,342 వార్డు స్థానాలకు 93,595 మంది నామినేషన్లు వేసినట్లు సమాచారం.
News December 4, 2025
సంగారెడ్డి: సమస్యాత్మక ప్రాంతాలు.. కలెక్టర్ కీలక సూచనలు

సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
News December 4, 2025
ఏలూరు: GOOD NEWS నెలకు రూ.12,500 వేతనం

ఏలూరు జిల్లా వ్యాప్తంగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ బుధవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు MEO కార్యాలయంలో డిసెంబర్ 5 తేదీలోపు దరఖాస్తు సమర్పించాలన్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు రూ.12,500, ఎస్జీటీ పోస్ట్కు రూ.10 వేల వేతనం ఇవ్వబడుతుందన్నారు. ఏలూరులో 4, కలిదిండిలో 1, కైకలూరులో 1, నూజివీడులో 1 పోస్టు ఉందన్నారు.


