News April 10, 2025
నిర్మల్ : నేడు, రేపు సదరం క్యాంపు

నిర్మల్ జిల్లాలో ఈనెల 10, 11వ తేదీన జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సదరం క్యాంపును నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ డీఆర్డీఓ శ్రీనివాస్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇదివరకు ఆన్‌లైన్లో స్లాట్ బుక్ చేసుకొని వెయిటింగ్ లిస్టులో ఉన్న వారు ఫ్లాట్ బుకింగ్ రసీదు, ఆధార్ కార్డు సంబంధిత పత్రాలతో ఉదయం 9 గంటలకు జిల్లా ఆసుపత్రికి రావాలన్నారు.
Similar News
News February 26, 2026
లిక్కర్ కేసు నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డికి రిమాండ్

AP: లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డికి ACB కోర్టు రేపటి దాకా రిమాండ్ విధించింది. గుంటూరు(D) జైలుకు అతడిని తరలించారు. A1 రాజ్ కసిరెడ్డితో కలిసి అవినాశ్ ₹కోట్ల లావాదేవీలు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ‘మద్యం సిండికేట్‌కు ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించారు. ముడుపులు చెల్లించే కొత్త బ్రాండ్లకు అనుకూలంగా ఆర్డర్ ఫర్ సప్లై కేటాయించారు’ అని అందులో వెల్లడించారు.
News February 26, 2026
పార్వతీపురం: ‘ఉగాది నాటికి 7,187 ఇళ్లు పూర్తి కావాలి’

జిల్లాలో గృహ నిర్మాణ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్‌లో భాగంగా గృహ నిర్మాణ పురోగతిపై కీలక సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉగాది పండగ నాటికి మొత్తం 7,187 ఇళ్లను పూర్తి చేయాలన్నారు.
News February 26, 2026
కన్నులపండువగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీసీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. తొలిరోజు స్వామి పుష్కరిణిలో తెప్పపై మూడు సార్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.


