News April 2, 2025
నిర్మల్: నేడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్లో బుధవారం ఉదయం 11 గంటలకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి గౌడ కులస్థులు, జిల్లా ప్రజలు అధికారులు సకాలంలో హాజరుకావాలని తెలిపారు.
Similar News
News October 24, 2025
ఖనిజ రంగంలో సింగరేణి మరో ముందడుగు

ఖనిజాల రంగంలో సింగరేణి మరో ముందడుగు వేసింది. సింగరేణి ప్రాంతంలో ఆ ఖనిజాల గుర్తింపు, ప్లాంట్ నిర్మాణంపై గురువారం కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థ ఎన్ఎఫ్టీడీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ సీఅండ్ఎండీ బలరామ్ మాట్లాడుతూ… సింగరేణి ప్రాంతంలో లభ్యమవుతున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉనికిని తెలుసుకొని ఉత్పత్తి చేసేందుకు కొత్తగూడెంలో ప్రయోగాత్మక ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
News October 24, 2025
కరీంనగర్: మద్యం దరఖాస్తులు ఎన్నంటే..?

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు గురువారంతో ముగిసింది. నాలుగు జిల్లాల్లోని మొత్తం 287 వైన్షాపులకు గానూ 7,565 దరఖాస్తులు వచ్చాయి. కరీంనగర్ (94 షాపులు): 2,730 దరఖాస్తులు (చివరి రోజు 77), పెద్దపల్లి (74 షాపులు): 1,488 దరఖాస్తులు (చివరి రోజు 94), జగిత్యాల (71 షాపులు): 1,966 దరఖాస్తులు (చివరి రోజు 119), రాజన్న సిరిసిల్ల (48 షాపులు): 1,381 దరఖాస్తులు (చివరి రోజు 48).
News October 24, 2025
కేయూ పరిధిలో హాస్టల్ వసతికి దరఖాస్తులు ఆహ్వానం

కేయూపీజీ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పొందిన ఫస్టియర్ విద్యార్థులు హాస్టల్ వసతి, మెస్ సదుపాయం కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని హాస్టళ్ల డైరెక్టర్ ప్రొఫెసర్ ఎల్.పీ.రాజ్కుమార్ సూచించారు. విద్యార్థులు https://kucolleges.co.in/hostels/new_admissions వెబ్సైట్లో ఫీజు చెల్లించి అప్లికేషన్ డౌన్లోడ్ చేసి రశీదు జత చేయాలన్నారు. అదనంగా ఆధార్, కుల ధ్రువపత్రం, ఫొటోలు సమర్పించాలన్నారు.


