News March 21, 2025
నిర్మల్: పది పరీక్షకు ఏడుగురు విద్యార్థులు గైర్హాజరు

నిర్మల్ జిల్లాలో శుక్రవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి రామారావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9,122 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 9,115 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు. కాగా జిల్లా వ్యాప్తంగా 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News October 17, 2025
ఎనుమాముల: పత్తాలేని పాలకవర్గం!

వరంగల్ ఎనుమాముల పాలకవర్గం ప్రకటించకపోవడంతో మార్కెట్కు వచ్చే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల వర్షాల కారణంగా మార్కెట్కు వచ్చిన పంటలను ఆరబెట్టుకుంటే కనీసం టార్పాలిన్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. MLA, మంత్రి మధ్య విభేదాల కారణంగా గతంలో ప్రకటించిన పాలకవర్గం ప్రమాణం స్వీకారం చేయకుండానే ఆగిపోయింది. ఇప్పటికైనా పాలకవర్గం వస్తేనే మార్కెట్ బాగుపడుతుందని అంటున్నారు.
News October 17, 2025
సంభావన పథకానికి రూ.2.16 కోట్ల నిధులు

నిరుద్యోగ వేదపండితులకు సంభావన (నిరుద్యోగ భృతి) కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2.16 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 600 మందికి గాను ఒక్కొక్కరికి రూ.3000 చొప్పున ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 7 ఆలయాల నుంచి ఈ నగదును తీసుకుంటుండగా వారికి భారం కావడంతో TTD నుంచి ప్రభుత్వం కోరింది. దీనిపై టీటీడీ బోర్డు తీర్మానం మేరకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
News October 17, 2025
ఎన్ని ఉద్యోగాలొస్తాయో గూగుల్లోనే సెర్చ్ చేయండి: గుడివాడ

విశాఖలో గూగుల్ ద్వారా 1.88 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి లోకేశ్ ప్రకటనలు చేస్తున్నారని.. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ ఉద్యోగులే 1.87 లక్షల మంది అని మాజీమంత్రి అమర్నాథ్ తెలిపారు. ఒక గిగావాట్ డేటా సెంటర్ వలన ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో గూగుల్లోనే సెర్చ్ చేయండని ఎద్దేవా చేశారు. US బోర్డర్ ఎలాస్పాలో మెటా డేటా సెంటర్లో 100-150 మందికి ఉద్యోగం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించిందన్నారు.