News March 21, 2025
నిర్మల్: పది పరీక్షకు ఏడుగురు విద్యార్థులు గైర్హాజరు

నిర్మల్ జిల్లాలో శుక్రవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి రామారావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9,122 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 9,115 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు. కాగా జిల్లా వ్యాప్తంగా 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News July 11, 2025
శాఖాంబరీగా.. భద్రాకాళి దర్శనం

వరంగల్ ప్రసిద్ధ భద్రకాళి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శాకంబరీగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అర్చకులు అమ్మవారిని ఉదయాన్నే ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి దర్శనం కోసం ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
News July 11, 2025
కరీంనగర్: ముఖ్య గమనిక.. రేపు స్క్రినింగ్ టెస్ట్

TG BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ స్క్రీనింగ్ ఈ నెల 12న నిర్వహించనున్నారు. పరీక్ష మధ్యాహ్నం12 గం. నుంచి 2గం. వరకు వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్‌లో జరుగుతుందని సర్కిల్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. పరీక్షకు ఉమ్మడి KNR, MNCL జిల్లాల అభ్యర్థులు హాల్ టికెట్లను http://tgbcstudycircles.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.
News July 11, 2025
కరీంనగర్: ట్రాన్స్ జెండర్లకు శుభవార్త

ట్రాన్స్‌జెండర్ల ఉపాధికి తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్‌లో ప్రత్యేక పథకం చేపట్టిందని జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక స్వావలంబనకై వారికీ డ్రైవింగ్, బ్యూటీషియన్ వంటి నైపుణ్య శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు జూలై 23, 2025లోగా www.wdsc.telangana.goవ్.inలో దరఖాస్తు చేయాలని, వివరాలకు 040-24559050ను సంప్రదించాలని వివరించారు.