News March 21, 2025

నిర్మల్: పది పరీక్షకు 9,129 మంది

image

పదో తరగతి వార్షిక పరీక్షలు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో రామారావు గురువారం తెలిపారు. జిల్లాలో మొత్తం 47 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం 9129 మంది విద్యార్థులకి 4,444మంది బాలురు, 4,685 మంది బాలికలు పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9:30 నుంచి12:30 గంటల వరకు పరీక్ష జరుగునుందన్నారు. అరగంట ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

Similar News

News September 15, 2025

‘ఎనోలి, కోలంగూడా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి’

image

వాంకిడి మండలం ఎనోలి, కోలంగూడా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో గ్రామస్థులు సోమవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, నడిచి వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి, రెండు గ్రామాలకు రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.

News September 15, 2025

HYD: తెలుగు వర్శిటీ.. స్పోర్ట్స్ మీట్-2025

image

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఈనెల 17 నుంచి విద్యార్థులకు, బోధన, బోధనేతర సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ R.గోపాల్ Way2Newsతో తెలిపారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్ తదితర క్రీడలు జరుగుతాయని చెప్పారు. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు మాత్రమే సౌత్ జోన్ ఇంటర్-యూనివర్సిటీస్ పోటీల్లో అవకాశం ఉంటుందన్నారు.

News September 15, 2025

HYD: తెలుగు వర్సిటీ.. ఎల్లుండి నుంచి క్రీడా పండుగ

image

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో బోధన, బోధనేతర, విద్యార్థులకు ఈనెల 17 నుంచి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. సోమవారం వర్సిటీ VC ఆచార్య నిత్యానందరావు, రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు క్రీడా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వర్సిటీ సిబ్బంది, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ R.గోపాల్ పాల్గొన్నారు.